yelamanchili
-
ఏపీలో కొససాగుతున్న విధ్వంస పాలన
-
కొడుకు అందివచ్చాడనుకుంటే.. ఇంతటి విషాదమా
యలమంచిలి రూరల్/అచ్యుతాపురం: పుట్టిన రోజే గిట్టిన రోజైంది.. మరో మిత్రుడినీ బలి తీసుకుంది. గాజువాక–యలమంచిలి బైపాస్ రోడ్డులో ఈ దారుణం జరిగింది. కట్టుపాలెం చెరకు కాటా వద్ద బుధవారం అర్ధరాత్రి నలుగురు మిత్రులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడిన సంఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. యలమంచిలికి చెందిన కొఠారు రవితేజ (27), అచ్యుతాపురం మండలం ఎస్ఈజెడ్ కాలనీకి చెందిన నడిపింటి రాజు (26), రాజాన వంశీ (20), బండారు ప్రదీప్ (26) స్నేహితులు. ఎస్ఈజెడ్లోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఈ కర్మంలో బుధవారం రవితేజ పుట్టిన రోజు కావడంతో వారంతా యలమంచిలి వెళ్లారు. అక్కడి నుంచి కారులో తిరిగి వస్తుండగా చెరకు కాటా వద్ద మలుపు తిరుగుతున్న సమయంలో ఎదురుగా లారీ రావడంతో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి పొలంలోకి నాలుగు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో రవితేజ, నడిపింటి రాజు అక్కడికక్కడే మృతి చెందారు. గాయాలపాలైన వంశీ, ప్రదీప్ విశాఖలో డెయిరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. యలమంచిలి టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు ఎదిగిన కొడుకులు కన్నుమూయడంతో రవితేజ, రాజు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. రవితేజ తండ్రి సత్యనారాయణ వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొడుకు అందివచ్చాడనుకుంటే ఇలా జరిగింది. గత ఏడాది ఫిబ్రవరిలో భార్య లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందింది. ఇప్పుడు కొడుకు కూడా మరణించడంతో ఆయనను అదుపు చేయడం ఎవరితరం కాలేదు. ఈ ప్రమాదంలో మృతి చెందిన నడిపింటి రాజుకు తల్లిదండ్రులు నాగరాజు, సీత, అక్క ఉన్నారు. రాజు డిగ్రీ పూర్తి చేసి సన్వీరా పరిశ్రమలో పనిచేస్తున్నాడు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తానని చెప్పాడని, విగత జీవిగా చూడాల్సివస్తుందనుకోలేదని తల్లి సీత గుండెలవిసేలా ఏడుస్తోంది. చదవండి: ప్రేమపెళ్లి.. ఏం కష్టం వచ్చిందో ఏమో.. పాపం -
పెళ్లి కావట్లేదని తాయెత్తు కోసం వెళ్లి..
సాక్షి, భువనేశ్వర్: తాయెత్తు కోసం వెళ్లిన ఓ వ్యక్తి దోపిడీకి ప్రణాళిక రచించి మరో ఐదుగురితో కలిసి భారీగా బంగారం, నగదు దోచుకున్నాడు. ఆ మొత్తంతో కుమార్తె వివాహం కూడా జరిపించాడు. చివరకు పోలీసులకు పట్టుబడ్డారు. వివరాలను ఏఎస్పీ తుహిన్ సిన్హా విలేకరులకు శనివారం వెల్లడించారు. యలమంచిలి మండలంలోని చోడపల్లిలో గత నెల 22న కుక్కర సీతారామయ్య ఇంట్లో దొంగలు పడి పది తులాల బంగారు ఆభరణాలు, ఎనిమిది తులాల వెండి, రూ.80వేల నగదు దోచుకెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ నారాయణరావు, అనకాపల్లి క్రైం బ్రాంచి ఎస్ఐ రంగనాథం ఆధ్వర్యంలో ఆరు బృందాలు ఏర్పడి దర్యాప్తు చేపట్టాయి. సంఘటన స్థలంలో సేకరించిన వేలిముద్రలను పాత నేరస్తుల వేలిముద్రలతో పోల్చి ఆరుగురు నిందితులను పట్టుకున్నారు. వీరిలో తూర్పుగోదావరి జిల్లాలో ఉంటున్న పాలా లక్ష్మీనారాయణ పెరూరి రాంబాబు, విజయనగరం జిల్లా పిత్తాడలో ఉంటున్న పాలా నవీన్, గొర్లె మోసి, గొర్లె ప్రకాశ్, విజయనగరం జిల్లా సోంపురానికి చెందిన గుమ్మడి బాలాజీలను అరెస్టు చేశారు. వీరి నుంచి ఐదున్నర తులాల బంగారం, ఎనిమిది తులాల వెండి, రూ.73 వేల నగదును స్వాదీనం చేసుకున్నారు. పక్కా స్కెచ్ తూర్పుగోదావరి జిల్లా తుని మండలం నందివంపు గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ చోరీల్లో బాగా ఆరితేరాడు. ఇతని కుమార్తెకు వివాహం జరగకపోవడంతో తాయెత్తు కోసం నవంబర్‌లో సీతారామయ్య ఇంటికి వచ్చాడు. ఆ సమయంలోనే సీతారామయ్య ఇంట్లో దొంగతనానికి లక్ష్మీనారాయణ స్కెచ్ వేశాడు. విజయనగరం జిల్లా పిత్తాడలో ఉంటున్న అన్నయ్య కొడుకు నవీన్‌కి సీతారామయ్య ఇంట్లో దొంగతనం చేయాలని చెప్పాడు. తూర్పుగోదావరి జిల్లా నుంచి తన స్నేహితుడైన పెరూరి రాంబాబుని మందు ఇప్పిస్తానని చెప్పి లక్ష్మీనారాయణ తనతో పాటు తీసుకువచ్చాడు. పిత్తాడ నుంచి నవీన్ తన బావ మరుదులైన గొర్లె మోసి, గొర్లె ప్రకాశ్‌లను స్నేహితుడైన గుమ్మడి బాలాజీలను వెంటబెట్టుకొని వచ్చాడు. ఆరుగురు అనకాపల్లి బైపాస్ వద్ద కలిసి నవంబరు 22 రాత్రి 9 గంటలకు ఆటోలో చోడపల్లి చేరుకున్నారు. రాత్రి 12 గంటలకు కత్తులు, కర్రలతో సీతారామయ్య ఇంట్లోకి చొరబడ్డారు. అడ్డొచ్చిన వారిని గాయపర్చి పని ముగించుకొని కాలినడకన అనకాపల్లి చేరుకున్నారు. దోచుకున్న సొత్తుతో లక్ష్మీనారాయణ తన కుమార్తెకు.. నవీన్ బావమరిది మోసితో వివాహం చేశాడు. ఈ నెల 25న పిత్తాడకి సమీపంలో గల కొబ్బరితోటలో వీరు సమావేశమై దోచుకున్న నగల్లో రెండు తులాల ఆభరణాన్ని ఓ ప్రైవేట్ గోల్డ్ కంపెనీలో అమ్మేశారు. మిగిలిన నగలు అమ్మడం విషయమై మాట్లాడుకుంటున్న సమయంలో పోలీసులకు పట్టుబడ్డారు. -
యలమంచిలి మార్పు కోసం..
సాక్షి, అచ్యుతాపురం: యలమంచిలి నియోజకవర్గంలో ఇప్పటివరకు కాంగ్రెస్, టీడీపీ పలుమార్లు అధికారం చేపట్టాయి. అయితే అభివృద్ధి జాడ మాత్రం కానరాలేదు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. గత ఎన్నికల్లో అధికార పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఈసారి ఎన్నికల్లో మార్పు తథ్యమని ప్రజలు భావిస్తున్నారు. అనుచరుల పాలన అవసరమా? ఇప్పటివరకూ అనధికార జాబితాప్రకారం యలమంచిలి టీడీపీ అసెంబ్లీ టికెట్‌ను పంచకర్ల రమేష్‌బాబుకు ఇవ్వడానికి అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. పంచకర్ల రమేష్‌బాబు స్థానికేతరుడని ఆ పార్టీకి చెందిన గ్రామస్థాయి నాయకులే ముఖం చాటేస్తున్నారు ఐదేళ్లలో పంచకర్ల మండలానికి ఒక ఇన్చార్జిని నియమించి పాలన సాగించారు. రెవెన్యూ, పోలీసు కార్యాలయాలను వారి గుప్పెట్లో పెట్టుకుని కార్యకర్తలకు కనీసం విలువలేకుండా చేశారు. ఆ అనుభవాలను ఇప్పటికీ గ్రామస్థాయి నాయకులు మర్చిపోలేదు. గ్రామంలో సమస్యలపై ఆ నాయకులు కార్యాలయాలకు వెళ్లే ఎమ్మెల్యే అనుచరులతో చెప్పించాలని స్వయంగా అధికారులే చెప్పడం నచ్చేదికాదు. దీంతో అనుచరుల పాలన మరలా అవసరమా అన్నట్టుగా ఆ పార్టీ గ్రామ నాయకులే పెదవి విరుస్తున్నారు. నియోజకవర్గంలో ఎప్పటినుంచో జెండా మోసి పార్టీలో పనిచేస్తున్న సీనియర్ నాయకులు ఉండగా మరోసారి స్థానికేతరుడికి సీటు కేటాయించడం దేశం పార్టీ స్థానిక నాయకులకు నచ్చడంలేదు. హామీలన్నీ నీటి మూటలే... నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. సెజ్‌లో నిర్వాసితులకు ఆర్ కార్డులు ఇచ్చి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అమలుకు నోచుకోలేదు. దుప్పుతూరు గ్రామాన్ని తరలిస్తామన్నారు. సెజ్ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేసి జీతాలు పెంచుతామని చెప్పారు. ఈఎస్ఐ ఆస్పత్రి, పూడిమడక మత్స్యకారులకు జట్టీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. యలమంచిలి పట్టణంతో పాటు రాంబిల్లి మండలంలో 20 గ్రామాలకు తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. మునగపాకలో పల్లపు ప్రాం తాలకు ముంపు సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఇవేమీ పరిష్కరించలేదు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు రోడ్ల విస్తరణ చేపడతామని, కొండకర్ల ఆవను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎలాంటి పనులు చేపట్టలేదు. అధికార పార్టీ నాయకలు ఐదేళ్లలో విస్మరించిన హామీలు ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఆ పార్టీకి గుణపాఠం చెప్పడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. మునగపాక, అచ్యుతాపురంలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయకుండా లాలం భాస్కరరావు గ్రామమైన లాలంకోడూరుకు కాలేజీ మంజూరు చేయడంపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. యలమంచిలి మున్సిపాలిటీలో పన్నుల భారాన్ని తగ్గించలేదు. ఫ్లెవోవర్ పనులు పూర్తికాలేదు. పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కరించడంలో శ్రద్ధచూపలేదు. ఉపాధి హామీ పథకం అమలు చేయమని పట్టణ ప్రజలు ఏళ్ల తరబడి కోరినా పట్టించుకోలేదు. ఇవన్నీ ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి దారితీసే అంశాలు కానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలతో మమేకమైన వైఎస్సార్సీపీ... వైఎస్సార్సీపీ ప్రచారంలో ముందంజలో ఉంది. జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ సాగింది. సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన యు.వి.రమణమూర్తిరాజు 130 రోజుల్లో 98 పంచాయతీలు, 27 మున్సిపల్ వార్డుల్లో ప్రతి ఇంటికీ తిరిగి నవరత్నాలను ప్రచారం చేశారు. మొదటి విడతలోనే ఎన్నిక జరగాల్సి రావడంతో సుమారు నెల రోజులకు మించి సమయంలేదు. టీడీపీ చెందిన పంచకర్ల రమేష్‌బాబు పెందుర్తి లేదా, విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేద్దామనున్నారు. అయితే పెందుర్తిని సిట్టింగ్ ఎమ్మెల్యేకు కేటాయించగా, ఉత్తరాన్ని లోకేష్‌కి కేటాయించనున్నట్టు సమాచారం. దీంతో పంచకర్ల ఇక్కడే పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. తక్కువ సమయంలో ప్రత్యర్థి పార్టీ నాయకులు ఇంటింటికి తిరగడం సాధ్యపడదు. వైఎస్సార్సీపీ మాత్రం వివిధ కార్యక్రమాల ద్వారా నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారితో మమేకమైంది. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు పట్టం కట్టడం తథ్యం. నవరత్నాలే వైఎస్సార్ సీపీకి అండ... వైఎస్సార్సీపీకి నవరత్నాలే శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. నియోజకవర్గం వ్యవసాయ, పారిశ్రామికరంగం మిళితమై ఉటుంది. మత్స్యకారులు, వివిధ కులవృత్తిదారులు ఉన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపొందించిన నవరత్నాలలో అన్ని పథకాలు ఈ నియోజకవర్గ ప్రజలకు సంపూర్ణంగా అందుతాయి. వైఎస్సార్సీపీ పాలనలో నియోజకవర్గం అన్నిరంగాల్లోనూ అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని ఓటర్లు వ్యక్తంచేస్తున్నారు. అధికారాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో ఈ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ ఏడు రోజులు పర్యటించారు. ప్రజలందరినీ కలిసి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. దారి పొడవునా నీరాజనం పలికారు. ప్రజల సమస్యలను గుర్తించారు. ఆయన అధికారంలోకి వస్తే పాదయాత్రలో గుర్తించిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారన్న నమ్మకం ప్రజలకి ఉంది. -
లైంగిక దాడికి యత్నించిన నిందితుడికి జైలు
యలమంచిలి : ఓ మహిళపై లైంగికదాడికి యత్నించిన నిందితునికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ.. నరసాపురం అసిస్టెంట్ సెషన్స్ జడ్జి పి.కేశవాచార్యులు తీర్పు చెప్పారు. ఎస్ఐ పాలవలస అప్పారావు కథనం ప్రకారం.. బూరుగుపల్లి పంచాయ తీ మట్టవానిచెరువుకు చెందిన బండి రామాంజనేయులు 2014 జనవరి 17న ఓ మహిళపై లైంగికదాడికి యత్నించాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ అడబాల విజయ్‌కుమార్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో వాదోపవాదాల అనంతరం నేరం రుజువు కావడంతో రామాంజనేయులుకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.మూడు వేలు జరిమానా విధిస్తూ నరసాపురం అసిస్టెంట్ సెషన్స్ జడ్జి పి.కేశవాచార్యులు తీర్పు చెప్పార -
ఎలమంచిలి అటవీశాఖ కార్యాలయంపై విజిలెన్స్ దాడి
ఎలమంచిలిలోని అటవీశాఖ కార్యాలయంలో మంగళవారం ఉదయం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. విశాఖపట్నం తీర ప్రాంతంలోని ఇసుక అక్రమ రవాణాపై అటవీ శాఖ సిబ్బందిని విజిలెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అందులోభాగంగా దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా రికార్డులను పరిశీలిస్తున్నారు. తీర ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా చేసే క్రమంలో లక్షలాది రూపాయిలు చేతులు మారినట్లు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో అధికారులు అటవీశాఖ కార్యాలయంపై దాడి చేశారు.