లైంగిక దాడికి యత్నించిన నిందితుడికి జైలు
Published Wed, Aug 17 2016 12:29 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
యలమంచిలి : ఓ మహిళపై లైంగికదాడికి యత్నించిన నిందితునికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ.. నరసాపురం అసిస్టెంట్ సెషన్స్ జడ్జి పి.కేశవాచార్యులు తీర్పు చెప్పారు. ఎస్‌ఐ పాలవలస అప్పారావు కథనం ప్రకారం.. బూరుగుపల్లి పంచాయ తీ మట్టవానిచెరువుకు చెందిన బండి రామాంజనేయులు 2014 జనవరి 17న ఓ మహిళపై లైంగికదాడికి యత్నించాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ అడబాల విజయ్‌కుమార్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో వాదోపవాదాల అనంతరం నేరం రుజువు కావడంతో రామాంజనేయులుకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.మూడు వేలు జరిమానా విధిస్తూ నరసాపురం అసిస్టెంట్ సెషన్స్ జడ్జి పి.కేశవాచార్యులు తీర్పు చెప్పార
Advertisement
Advertisement