
విలేకరులతో మాట్లాడుతున్న హీరో విజయ్ దేవరకొండ
తూర్పుగోదావరి, దానవాయిపేట (రాజమహేంద్రవరం): సినీ హీరో విజయ్ దేవరకొండ శుక్రవారం నగరంలో హల్‌చల్ చేశారు. స్థానిక జేఎన్ రోడ్డు రామాలయం సెంటర్‌లో ఉన్న కేఎల్‌ఎం షాపింగ్ మాల్‌లో ఫెస్టివ్ ఆఫర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేఎల్‌ఎం సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం ఆనందంగా ఉందన్నారు. కేఎల్‌ఎం అనతి కాలంలోనే 15 శాఖలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విజయ్ దేవరకొండను చూసేందుకు పిల్లలు, పెద్దలు ఆసక్తి చూపారు. ముఖ్యంగా యువతీ యువకులు ఆయనను చూసేందుకు ఎగబడడంతో డా ప్రాంతం సందడిగా మారింది. ఆఫర్ల ప్రారంభ కార్యక్రమంలో సంస్థ సీఈవోలు రాజేష్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.