KLM Fashion Mall
-
కళామందిర్‌కు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: సంప్రదాయ దుస్తుల విక్రయ సంస్థ సాయి సిల్క్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఐపీవో ద్వారా రూ. 1,200 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఇష్యూలో భాగంగా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా 1.80 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. కళామందిర్, వరమహాలక్ష్మి సిల్క్స్, కేఎల్ఎం, మందిర్ బ్రాండ్లతో కంపెనీ రిటైల్ స్టోర్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈక్విటీ జారీ నిధులను 25 కొత్త స్టోర్లు, 2 వేర్‌హౌస్‌ల ఏర్పాటుకు వినియోగించనుంది. అంతేకాకుండా రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలు తదితరాలకు సైతం కేటాయించనుంది. కంపెనీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులలో 50 స్టోర్లను నిర్వహిస్తోంది. రూ. 2,400 కోట్లపై కేఫిన్ కన్ను ఫైనాన్షియల్ సర్వీసుల ప్లాట్‌ఫామ్ కేఫిన్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా అనుమతించింది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 2,400 కోట్లు సమకూర్చుకోవాలని ప్రణాళికలు వేసింది. కంపెనీ ప్రమోటర్ జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్ పీటీఈ లిమిటెడ్ వాటాను విక్రయించనుంది. ప్రస్తుతం కేఫిన్‌లో జనరల్ అట్లాంటిక్ దాదాపు 75 శాతం వాటాను కలిగి ఉంది. గతేడాది ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కొటక్ మహీంద్రా 9.98 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఐపీవో దరఖాస్తును కంపెనీ మార్చిలో సెబీకి దాఖలు చేసింది. -
ఖమ్మంలో ‘బేబమ్మ’ సందడి.. ‘ఉప్పెన’లా ఎగసిపడ్డ జనం
‘ఉప్పెన’ మూవీతో మెగా మేనల్లుడు పంజా వైష్ణశ్ తేజ్, కృతి శెట్టీలు హీరోహీరోయిన్లుగా వెండితెరకు పరిచమయ్యారు. మొదటి చిత్రంతోనే వైష్ణవ్, కృతీలు భారీ సక్సెస్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఆర్సీగా వైష్ణవ్ తన అమాయకంతో, బేబమ్మగా కృతి అందం, అభినయనంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. దీంతో ఈ క్యూట్ జోడికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందని చెప్పడంలో అతిశయోశక్తి లేదు. దీనికి ఈ తాజా సంఘటనే ఉదాహరణ. ఖమ్మంలోని కేఎల్ఎం షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు బేబమ్మ-ఆర్సీలు ముఖ్య అతిథులుగా హజరై షోరూంను ప్రారంభించారు. దీంతో వీరిని చూసేందుకు జనం వేల సంఖ్యలో తరలివచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వైష్ణవ్, కృతీలను చూసేందుకు ‘ఉప్పెన’లా ఎగిసిపడ్డ జనసంద్రాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కాగా లాక్డౌన్ తర్వాత విడుదలై సినిమాల్లో ‘ఉప్పెన’ 100 కోట్ల క్లబ్లో చేరిన మొదటి సినిమాగా గుర్తింపు పొందింది. దీంతో ఈ మూవీ హీరోహీరోఇయన్, దర్శకుడు పలు కార్యక్రమాల్లో పాల్గొంటు బిజీ అయిపోయారు. వీరికి ఉప్పెన నిర్మాతల నుంచి విలువైన బహుమతులు అందాయి. ఇటీవల బచ్చిబాబు సనాకు మైత్రీ మూవీ మేకర్స్ విలువైన బెంజ్ కారు బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. Khammam lo KLM shopping mall opening lo Uppena Hero Heroines ni choodadaaniki Uppenalaa egasipadina janam... pic.twitter.com/76OgBVLPcX — BARaju (@baraju_SuperHit) April 3, 2021 చదవండి: ‘ఉప్పెన’ డిలీటెడ్ సీన్.. ఆ అమ్మాయి కాళ్లు పట్టుకున్న వైష్ణవ్ ఎన్టీఆర్ కొత్త సినిమా: 60 ఏళ్ల మాజీ వృద్ధ ఆటగాడిగా..! -
సికింద్రాబాద్‌లో కార్తీకేయ, నిధీ అగర్వాల్ సందడి
-
రౌడీ సందడి
ఏఎస్‌రావునగర్: ఏఎస్‌రావునగర్ అణుపురం కాలనీలో కేఎల్ఎం (కీప్ లవింగ్ మోర్) ఫ్యాషన్ మాల్‌ను గురువారం టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబ్బురపరిచే అంతర్జాతీయ ఫ్యాషన్స్, విభిన్న వెరైటీలను ఏఎస్‌రావునగర్ పరిసర ప్రాంతవాసులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. సంస్థ సీఈవో కళ్యాణ్ మాట్లాడుతూ.. సరికొత్త ఫ్యాషన్ ప్రపంచంలో కేఎల్ఎం ఫ్యాషన్ మాల్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో మరిన్ని కేఎల్ఎం ఫ్యాషన్ మాల్స్‌ను ఏర్పాటు చేయనున్నామన్నారు. త్వరలో బోడుప్పల్, ప్యాట్నీ సెంటర్లలో షో రూంలను ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. -
కేఎల్ఎం అంబాసిడర్ కావడం ఆనందదాయకం
తూర్పుగోదావరి, దానవాయిపేట (రాజమహేంద్రవరం): సినీ హీరో విజయ్ దేవరకొండ శుక్రవారం నగరంలో హల్చల్ చేశారు. స్థానిక జేఎన్ రోడ్డు రామాలయం సెంటర్లో ఉన్న కేఎల్ఎం షాపింగ్ మాల్లో ఫెస్టివ్ ఆఫర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేఎల్ఎం సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం ఆనందంగా ఉందన్నారు. కేఎల్ఎం అనతి కాలంలోనే 15 శాఖలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విజయ్ దేవరకొండను చూసేందుకు పిల్లలు, పెద్దలు ఆసక్తి చూపారు. ముఖ్యంగా యువతీ యువకులు ఆయనను చూసేందుకు ఎగబడడంతో డా ప్రాంతం సందడిగా మారింది. ఆఫర్ల ప్రారంభ కార్యక్రమంలో సంస్థ సీఈవోలు రాజేష్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా సాక్షి పండుగ సంబరాలు
-
సుచిత్రా సర్కిల్లో బిగ్‌బాస్ విజేత కౌశల్ సందడి
-
కేఎల్ఎమ్ మాల్‌ను ప్రారంభించిన విజయ్ దేవరకొండ, రష్మిక
-
గీత.. గోవింద్
గీత గోవిందం ఫేం హీరో హీరోయిన్లు విజయ్‌దేవరకొండ, రష్మికలు చందానగర్‌లో సందడి చేశారు. మంగళవారం వీరు ఇక్కడ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్‌ను ప్రారంభించారు. మియాపూర్: ‘గీత గోవిందం’ సినిమా హీరోవిజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మండన్న మంగళవారం చందానగర్‌లో సందడి చేశారు. ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన కేఎల్ఎం ఫ్యాషన్ మాల్‌ను వారు ప్రారంభించారు. విజయ్ను చూసేందుకు అభిమానులు కేరింతలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ.. అబ్బుపరిచే అంతర్జాతీయ ఫ్యాషన్ దుస్తులు కేఎల్ఎం మాల్ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు.కార్యక్రమంలో నిర్వాహకులు కళ్యాణ్ పాల్గొన్నారు. -
అభిమాన సందడి..
-
వైజాగ్ లో కాథరీన్, మెహ్రీన్ కౌర్, శాలిని పాండే సందడి