సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబునాయుడు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టటం దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఓ నెగిటివ్ మనిషి అని మండిపడ్డారు. గతంలో తొమ్మిదేళ్లు, గడిచిన ఐదేళ్లు రాష్ట్రానికి చంద్రబాబు చేసిన అభివృద్ధి శూన్యమని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని దుయ్యబట్టారు.
చంద్రబాబు కోర్టుకు వెళ్లి స్టేలు తీసుకుంటున్నారని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. కావాలని చంద్రబాబు ప్రజల్లో దుష్పప్రచారం చేసున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి తిరోగమనం పట్టించే విధంగా పయనిస్తున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. రాజధాని విషయంలో నిపుణుల కమిటీ సిఫార్సులు, నివేదికల ఆధారంగా సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment