శ్రీ చైతన్య యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి..! | Vijaya Sai Reddy Demands DA For AP Home Guards | Sakshi
Sakshi News home page

శ్రీ చైతన్య యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి..!

Published Mon, May 13 2019 5:06 PM | Last Updated on Mon, May 13 2019 5:09 PM

Vijaya Sai Reddy Demands DA For AP Home Guards - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల సమయంలో 65 రోజులు ఎర్రని ఎండలో డ్యూటీ చేసిన హోంగార్డులకు తొమ్మిదివేల చొప్పున డీఏ చెల్లించాలని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి డిమాండ్‌ చేశారు. 12 వేల మంది ఉద్యోగులకు కేవ లంరూ.4500 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పూర్తికాని పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రూ.400 కోట్లు వెదజల్లి ఖజానా ఖాళీ చేసిన చంద్రబాబుకు హోంగార్డుల కుటుంబాల ఉసురు తగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు చెల్లింపులన్నిటినీ వెంటనే నిలిపివేయాలని అన్నారు.

రాయపాటి సంస్థలకు అక్రమంగా రూ.400 కోట్లు చెల్లించేందుకే చంద్రబాబు కేబినేట్‌ సమావేశమంటూ హడావిడి చేస్తున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత పనులపై ఆడిటింగ్‌ జరిపిన తర్వాతే పేమెంట్స్‌ చేయాలని స్పష్టం చేశారు. సైన్స్‌ టీచర్‌ సుధారాణి మృతికి కారణమైన శ్రీ చైతన్య యాజమాన్యంపై హత్యకేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాలేని స్థితిలో ఉన్నా.. శిక్షణ పేరుతో ఆమెను అనంతపురం నుంచి కర్నూలుకు పిలిపించారని, నిండు గర్భిణి దూర ప్రయాణం చేయడం వల్ల తీవ్ర రక్త స్రావమై ఆమె మరణించిందని వివరించారు. సుధారాణి కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement