'ఉత్తరాంధ్రకు ప్రతినిధిగా అమ్మను పోటీకి దింపా' | Vijayamma contested from Vizag to instill confidence in East Andhra, says ys jagan | Sakshi
Sakshi News home page

'ఉత్తరాంధ్రకు ప్రతినిధిగా అమ్మను పోటీకి దింపా'

Published Thu, Jun 12 2014 12:53 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

'ఉత్తరాంధ్రకు ప్రతినిధిగా అమ్మను పోటీకి దింపా' - Sakshi

'ఉత్తరాంధ్రకు ప్రతినిధిగా అమ్మను పోటీకి దింపా'

విశాఖ : నాన్న బతికున్నంతకాలం అమ్మ ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తనకు తోడుగా ఉంటుందనే అమ్మను రాజకీయాల్లోకి తీసుకు వచ్చినట్లు ఆయన తెలిపారు.  సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరుపుతున్న సందర్భంగా వైఎస్ జగన్ గురువారం మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు భరోసా ఉంటుందనే విశాఖ నుంచి అమ్మతో పోటీ చేయించినట్లు తెలిపారు. విశాఖ నాయకులు, కార్యకర్తలపై నమ్మకంతోనే విశాఖ ఎంపీగా అమ్మను నిలబెట్టినట్లు ఆయన చెప్పారు. విశాఖ లోక్సభ ఎన్నికల సమయంలో కడప నుంచి ఒక్క సామాన్య కార్యకర్త కూడా రాలేదని జగన్ తెలిపారు.

 

కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం విజయవాడలో ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించనున్నారు. కానూరులోని ఆహ్వానం ఫంక్షన్ హాల్ లో విజయవాడ, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్ష చేయనున్నారు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement