
హొళగుంద: కర్నూలు జిల్లా హొళగుంద–ఆదోని మార్గంలోని హెబ్బటం వద్దనున్న చెళ్లవంకలో ఆదోని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ 21జెడ్ 0133) ఓ పక్కకు ఒరిగిపోయింది. అక్కడే ఉన్న హెబ్బటం గ్రామ రైతులు, కూలీలు వెంటనే స్పందించి ప్రయాణికులను కాపాడడంతో అంతా సురక్షితంగా బయట పడ్డారు. సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు హొళగుంద నుంచి ఆదోనికి బయలు దేరింది.
అందులో డ్రైవర్, కండక్టర్‌తో పాటు ఎనిమిది మంది పెద్దలు, ఇద్దరు చిన్నారులున్నారు. ఎగువన కురిసిన వర్షానికి చెళ్లవంక ఉధృతంగా ప్రవహిస్తోంది. అయినప్పటికీ డ్రైవర్ కల్వర్టు మీదుగా వంకను దాటడానికి బస్సును ముందుకు నడిపాడు. అది ఓ పక్కకు ఒరిగిపోయింది. సమీప పొలాల్లో ఉన్న రైతులు, కూలీలు వెంటనే అక్కడికి చేరుకుని బస్సులో ఉన్న ప్రయాణికులను క్షేమంగా బయటకు తీశారు. డ్రైవర్‌కు కల్వర్టు సరిగా కనపడక వంకలోకి వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment