రైతులు బాగుంటేనే.. | vip Reporter b.Srinivasa Rao | Sakshi
Sakshi News home page

రైతులు బాగుంటేనే..

Published Sun, Dec 21 2014 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM

vip Reporter b.Srinivasa Rao

 ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నాలు. గిట్టుబాటు ధర మాట అటుంచి మిల్లర్ల మాయాజాలంలో నిలువునా దగా పడుతున్నారు. తేమ 17 శాతం మించకూడదన్న నిబంధన.. ధాన్యం అమ్మిన 48 గంటలు దాటినా సొమ్ము జమ కాకపోవడంతో రైతులు మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. తక్కువ ధరకే ధాన్యాన్ని వారికి విక్రయిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వరి ఆరబోత యంత్రాలు, టార్పాలిన్ల కొరత, రవాణా తదితర విషయూల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐకేపీ కేంద్రాల్లో ట్రక్ షీట్. బ్యాంకు ఖాతాలు, ఆధార్ వివరాల నమోదులో తప్పులు దొర్లుతున్నాయి.
 
 దీంతో బ్యాంకుల నుంచి సొమ్ములు రైతుల ఖాతాలకు జమ కావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొవ్వూరు రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ (ఆర్డీవో) బి.శ్రీనివాసరావు ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు ఆయన ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. దొమ్మేరులోని కొనుగోలు కేంద్రానికి వెళ్లి రైతులతో మాట్లాడారు. మిల్లర్లు వద్ద తేమ శాతం నిర్ధారణలో వ్యత్యాసాలు నమోదవుతున్నట్టు గుర్తించి ఓ రైస్‌మిల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు బాగుంటేనే మనమంతా బాగుంటామని అన్నారు. రైతులు, ఐకేపీ మహిళలు, మిల్లర్‌తో ఆర్డీవో ఇంటర్వ్యూ ఇలా సాగింది.
 
 ఆర్డీవో : నేను ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా వచ్చాను. గతంలో ఇక్కడి రైతులు ధాన్యం ఎవరికి అమ్మేవారు. క్వింటాల్‌కు రేటు ఎలా ఉండేది.
 రైతులు : వ్యాపారులకు అమ్మేవాళ్లం. ఆరుదల
 ధాన్యానికి రూ.వెయ్యి, పచ్చి ధాన్యం అయితే రూ.850-860 మధ్య వచ్చేది.
 ఆర్డీవో : అప్పటికీ, ఇప్పటికీ రేటు విషయంలో మార్పు ఉందా.
 జుజ్జవరపు నాగేశ్వరరావు : మార్పు ఏమీ లేదండి. డబ్బులు వెంటనే వచ్చేస్తాయన్న భ్రమతో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో అమ్మాం. గత నెల 22న
 అమ్మితే ఇప్పటికీ డబ్బులు రాలేదు.
 ఆర్డీవో : మీ సమస్యను ఎవరికి తెలియజేశారు.
 నాగేశ్వరరావు : ఎవరికి చెప్పాలో తెలియక ధాన్యం కొనుగోలు కేంద్రం చుట్టూ తిరుగుతున్నాం సార్.
 ఆర్డీవో  : రండి.. ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లి వివరాలు తెలుకుందాం. ఇక్కడ కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి ఎవరు? ఎంత ధాన్యం కొనుగోలు చేశారు?
 పద్మావతి : నేనే సార్. ఇప్పటి వరకు 177 మంది రైతుల నుంచి 2,357 టన్నుల ధాన్యం కొన్నాం.
 ఆర్డీవో : ఇంకా ఎంతమందికి సొమ్ములు చెల్లించాలి
 పద్మావతి : ట్రక్ షీట్‌లో తప్పులు ఉన్నాయని 20 మందికి బ్యాంకు నుంచి డబ్బులు చెల్లించలేదు.
 ఆర్డీవో : గతనెల 22న ధాన్యం అమ్మిన రైతు నేటికీ సొమ్ము అందలేదంటున్నారు. దీనిపై ఎలాంటి చర్య తీసుకున్నారు.
 పద్మావతి : ట్రక్ షీట్‌లో తప్పులను సరిచేయించి పంపించాం సార్.
 ఆర్డీవో : వెంటనే లోపాలు సవరించి సొమ్ములు అందని రైతులందరికీ ఒకట్రెండు రోజుల్లో డబ్బు అందించండి.
 కలగర రాధాకృష్ణ ప్రసాద్, రైతు :  ఐకేపీ కేంద్రం ద్వారా 40 బస్తాల ధాన్యం కొవ్వూరు మిల్లుకు పంపాం. క్వింటాల్‌కు ఐదు కిలోల చొప్పున 65 కేజీలు తరుగు కింద తగ్గించారు.
 ఆర్డీవో : ఈ విషయూన్ని సివిల్ సప్లైస్ అధికారుల ద్వారా తహసిల్దార్ దృష్టికి తీసుకువెళ్లారా?
 పద్మావతి : ఈ సమస్య మాకు ఇప్పుడే తెలిసింది సార్.
 అబ్బాయిరాజు, రైతు : ఎక్కువ ధాన్యం ఉంటే కళ్లాల నుంచే సేకరిస్తామని చెప్పారు గానీ అమలు కావడం లేదు. లోడింగ్, అన్‌లోడింగ్ , రవాణా చార్జీల భారం రైతులపైనే పడుతోంది సార్.
 ఆర్డీవో : కళ్లాల నుంచే ధాన్యాన్ని నేరుగా సేకరిస్తామని ఫ్రభుత్వం చెప్పింది. ఎక్కువ ధాన్యం ఉంటే రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది. రైతులు రవాణా నిమిత్తం ఖర్చు చేసిన చార్జీల బిల్లులను కొనుగోలు కేంద్రానికి  లేదా తహసిల్దార్‌కు పంపించాలి. వాటిని సివిల్ సప్లైస్ డీఎం కార్యాలయానికి పంపి బిల్లులు ఇప్పిస్తాం.
 నాగేశ్వరరావు, రైతు : మిల్లర్లు అన్‌లోడింగ్ చార్జీల కింద బస్తాకు రూ.20 చొప్పున వసూలు చేస్తున్నారు. ధాన్యం వెనక్కి తీసుకురాలేని పరిస్థితుల్లో దిగుమతి కూలీ చెల్లించాల్సి వస్తోంది. రైతుకు లోడింగ్, అన్‌లోడింగ్ చార్జీలు భారమవుతున్నాయి.
 ఇతర రైతులు : తేమశాతం పేరుతో మిల్లర్లు మోసగిస్తున్నారు. ఇక్కడ 17 తేమ శాతం వస్తే మిల్లు దగ్గరకు వెళితే 19 నుంచి 21 శాతం తేమ ఉందని తప్పుడు లెక్కలు చూపించి ఇబ్బందులు పెడుతున్నారు. బస్తాకు రూ.80 నుంచి రూ.100 త గ్గిస్తున్నారు.
 ఆర్డీవో : కొందరు మిల్లర్లు తేమ శాతం ఎక్కువ చూపించి రైతులను మోసగిస్తున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఈ రకమైన సమస్యలుంటే వెంటనే తహసిల్దార్‌కు ఫిర్యాదు చేయండి.
 ఆర్డీవో : జెడ్పీటీసీ గారూ.. మీ ఊళ్లో ధాన్యం కొనుగోళ్లు ఎలా సాగుతున్నాయండి.
 గారపాటి శ్రీదేవి, జెడ్పీటీసీ : మిల్లర్లు రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. తరుగు, రవాణా చార్జీలను రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. రైతుకు ఎక్కడా న్యాయం జరగడం లేదు. పొలం నుంచే నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తే రైతుకు లాభం చేకూరుతుంది.
 అక్కడి నుంచి ఆర్డీవో శ్రీనివాసరావు సమీపంలోని విజయదుర్గా రైస్ మిల్లుకు వెళ్లారు. మిల్లర్‌ను ఉద్దేశించి...
 ఆర్డీవో : మీ పేరు చెప్పండి. రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేసిన వివరాలను నమోదు చేస్తున్నారా.
 మిల్లర్ : నా పేరు వట్టికూటి సత్యనారాయణ సార్. ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు నేరుగా చెక్కులు అందిస్తున్నాం. వివరాలు నమోదు చేయడం లేదు.
 ఆర్డీవో : నేరుగా సేకరించిన ధాన్యంలో 25 శాతం లెవీ కింద ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఏ రైతు నుంచి ఎంత ధాన్యం సేకరిస్తున్నాం, రకం ఏమిటి, రైతు సాగు చేస్తున్న విస్తీర్ణం, రైతుకు ఇచ్చిన మద్దతు ధర తదితర వివరాలు కచ్చితంగా నమోదు చేయాలి.
 సత్యనారాయణ, మిల్లర్ : ఇక నుంచి నమోదు చేయిస్తాం సార్.
 ఆర్డీవో : ఐకేపీ కేంద్రంలో చూపించిన తేమ శాతానికి మిల్లర్ల వద్ద చూపిస్తున్న తేమ శాతానికి వ్యత్యాసాలు వస్తున్నాయని రైతులు, ఐకేపీ మహిళలు చెబుతున్నారు. ఎందుకు తేడా వస్తోంది.
 సత్యనారాయణ : శాంపిల్ తీసుకువచ్చే విధానంలో లోపాలు ఉంటాయి. శాంపిల్‌ను గాలి తగలకుండా పాలిథిలిన్ కవర్‌లో పెట్టి జాగ్రత్తగా తీసుకురావాల్సి ఉంటుంది. మెషిన్‌కు మెషిన్‌కు మధ్య కూడా వ్యత్యాసాలు ఉంటారుు. తేమ శాతం స్వల్పంగా తేడా ఉన్నా ధాన్యం కొంటున్నాం సార్.
 ఆర్డీవో : గతంలో ఎక్కువ కొనుగోలు చేసేవారా.. ఇప్పుడు ఎక్కువ కొనుగోలు చేస్తున్నారా.. ప్రస్తుతం విధానం ఎలా ఉంది.
 సత్యనారాయణ : ఇప్పుడే బాగుంది సార్. బ్యాంకు గ్యారంటీ కూడా లభిస్తోంది.
 ఐకేపీ కేంద్రం నుంచి ధాన్యం శాంపిల్ తీసుకొచ్చిన ఆర్డీవో.. ఇందులో తేమశాతం 18.3 శాతం ఉన్నట్టు ఐకేపీ కేంద్రంలో వచ్చిందని, మిల్లులో ఎంత వస్తుందో చూద్దామని మిల్లర్‌తో అన్నారు. మిల్లర్ సత్యనారాయణ ఆ శాంపిల్‌ను తేమ శాతం మెషిన్‌లో ఉంచి పరిశీలించగా 14.8 తేమ శాతం వచ్చింది. ఆర్డీవో సహా అక్కడి వారంతా అవాక్కయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ రైతుల విషయంలో ఐకేపీ గ్రూపులు, మిల్లర్లు నిజారుుతీతో వ్యవహరించాలని కోరారు. రైతులు బాగుంటుందనే మనం బాగుంటామని అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement