సాక్షి, విశాఖపట్టణం : ఆంధ్రప్రదేశ్‌కు ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్టణాన్ని ఎంచుకోవడంపై రాజ్యసభ సభ్యులు టి. సుబ్బిరామిరెడ్డి స్పందించారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ఆయన జీఎన్ రావు కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందించిందన్న సమాచారం మీడియా ద్వారా తెలుసుకున్నా. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావడం ఉపయోగకరంగా ఉంటుందని నా అభిప్రాయం. విభజనకు ముందు హైద్రాబాద్ తర్వాత పెద్ద సిటీ విశాఖే. నగరంలో మౌలిక సదుపాయాలతో పాటు విస్తారమైన భూములున్నాయి. పరిశ్రమలున్నాయి. పారిశ్రామికవేత్తలకు పరిచయమైన ప్రాంతం కావడంతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే మరింత మంది పారిశ్రామిక వేత్తలు వస్తారు. విస్తరణకు మంచి అవకాశముంది. ఆర్థిక సమస్యలున్న దృష్ట్యా ప్రస్తుతానికి రెడీమేడ్ సిటీ విశాఖయే మంచి ఆప్షన్. మరింత అభివృద్ధి చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అద్భుతమైన రాజధాని అవుతుందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment