
'విశాఖను రాజధాని చేయడం మంచిదే'
విశాఖపట్నం: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను స్వాగతిస్తున్నామని మాజీమంత్రి పసుపులేటి బాలరాజు అన్నారు. ఆదివారం విశాఖ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాజ్యంగబద్ధంగా వ్యవహరిస్తోందని తెలిపారు. కేంద్రం నమ్మకున్న నాయకుడి వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని పరోక్షంగా కిరణ్‌కుమార్‌రెడ్డి తీరును దుయ్యబట్టారు. విశాఖను రాజధాని చేయడం మంచిదేనని, అయితే దీనిపై ప్రాంతీయ విద్వేశాలను రెచ్చగొట్టడం సరైంది కాదన్నారు.