pasupuleti balaraju
-
'టీడీపీ మహానాడు ఓ పెద్ద మాయ'
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ మహానాడు ఒక పెద్ద మాయ అని, పార్టీ క్యాడర్ జారిపోతుందనే భయంతోనే చంద్రబాబు మహానాడు నిర్వహించారని విఎంఆర్డిఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ విమర్శించారు. టీడీపీ ప్రజా వ్యతిరేక విధానాల ధోరణిపై, మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మళ్ల విజయప్రసాద్‌తో కలిసి ద్రోణంరాజు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ఏడాది కాలంలో ఏం చేశారని చంద్రబాబు మహానాడు నిర్వహించారని ప్రశ్నించారు.చంద్రబాబు నాయుడు ప్రజావ్యతిరేకిగా ఉండడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టే ప్రతి అభివృద్ధి పని అడ్డుకుంటున్నారని తెలిపారు.(రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా వాణీమోహన్) మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు మాట్లాడుతూ.. ' 40 ఏళ్ల అనుభవం అని చెప్పే చంద్రబాబు నిత్యం ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు చేసిన ఒక మంచి పనైనా చెప్పుకోగలరా ? సీఎంగా వైఎస్ జగన్ ఏడాది పాలనలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు సమానంగా కొనసాగుతున్నాయి. వైఎస్ జగన్ పదవి బాధ్యతలు చెప్పట్టిన రోజు రాష్ట్రం ఊబిలో కూరుకుపోయి ఉంది. ఆయన దూరదృష్టితో ఆలోచించి కష్టాల్లో ఉన్న సమయంలోనూ ప్రజలను ఆదుకుంటున్నారు . వైఎస్ జగన్ కారణంగానే ఆదివాసుల జీవితాలు మెరుగుపడ్డాయి. అభివృద్ధికి ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు అభినందనీయం' అని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అందిస్తున్ననవరత్నాలు టిడిపి కార్యకర్తలతో పాటు ఆ పార్టీ సానుభూతి పరులకు కూడా చేరాయి. అభివృద్ధి ఓర్వలేక చంద్రబాబు నాయుడు ప్రతీది రాజకీయం చేస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు టిడిపి ఎమ్మెల్యేలు 50 లక్షలు నష్టపరిహారం అడిగితే సీఎం జగన్ కోటి రూపాయలు ఇచ్చారు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో టీడీపీది శవరాజకీయం' అంటూ మండిపడ్డారు. (సెప్టెంబర్ వరకు జీ7 సమ్మిట్ వాయిదా) మాజీ ఎమ్మెల్యే కుంబా రవిబాబు మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులను మాత్రమే కాదు ఆత్మాభిమానాన్ని కూడా సీఎం వైఎస్ జగన్ గుర్తించారని పేర్కొన్నారు. బాక్సైట్ తవ్వకాల్లో జీవో 97 రద్దు ద్వారా సీఎం గిరిజనుల పక్షపాతిగా నిలిచారు. రాజకీయాలు శాసిస్తానని చెప్పే చంద్రబాబు నాయుడు కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతున్నారన్నారు.మహానాడు తీర్మానాలు చూస్తుంటే టీడీపీ పని అయిపోయిందని ప్రజలకు అర్థమైందన్నారు. టీడీపీ పుట్టినప్పటి నుంచి ఇంత పనికిమాలిన తీర్మానాలు మహానాడులో చేయలేదు. ఐదేళ్లలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చినట్టు చెప్పే చంద్రబాబు నాయుడు ఒక్క ఉద్యోగమైనా తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. పోలవరం పట్టిసీమ ప్రాజెక్టుల్లో టీడీపీ అవినీతిలో కూరుకుపోయిందన్నారు. జెసి దివాకర్‌కు చెందిన బస్సు ప్రమాదం లో 30 మంది చనిపోయినా... జుట్టు పట్టుకొని ఎమ్మార్వో వనజాక్షిని కొట్టినా న్యాయస్థానాలకు గుర్తుకు రాలేదన్నారు. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. -
జనసేనకు మరో షాక్.. మరో సీనియర్ నేత గుడ్‌బై
-
జనసేనకు మరో షాక్.. మరో సీనియర్ నేత గుడ్‌బై
సాక్షి, విశాఖపట్నం: జనసేన పార్టీకి విశాఖలో బిగ్ షాక్ తగిలింది. ఇసుక అంశంపై పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం నగరంలో లాంగ్ మార్చ్ చేపట్టిన సమయంలోనే ఆ పార్టీ సీనియర్ నేత పసుపులేటి బాలరాజు గుడ్‌బై చెప్పారు. జనసేనకు రాజీనామా చేసిన ఆయన ఈ సందర్బంగా పార్టీ అధినాయకత్వం తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జనసేనలో ప్రజాసమస్యలపై చర్చ జరగడం లేదని, ఆ పార్టీతో ప్రజాసమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు తక్కువ అని ఆయన తేల్చి చెప్పారు. ఇసుక కొరతను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా.. పవన్ కల్యాణ్ మార్చ్‌లు ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించారు. విశాఖ మన్యం ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తూ జీవో 97ను జారీచేయడం, పాడేరులో మెడికల్ కాలేజీ మంజూరు చేయడం హర్షనీయమని ఏపీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రజలకు ఉపయోగపడతానని భావించే పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని పసుపులేటి బాలరాజు తెలిపారు. గత ఎన్నికల్లో ఆయన పాడేరు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గత కొద్దిరోజులుగా బాలరాజు జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. పవన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన లాంగ్ మార్చ్ సన్నాహాల కోసం శనివారం జరిగిన సమావేశానికి కూడా గైర్హాజరు అయ్యారు. -
విశాఖలో జనసేనకు మరో షాక్!
సాక్షి, విశాఖ: జనసేన పార్టీకి విశాఖలో బిగ్ షాక్ తగలనుంది. మరో నేత ఆ పార్టీని వీడనున్నారు. ఇసుక కొరతను నిరసిస్తూ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం (నవంబర్ 3) నగరంలో లాంగ్ మార్చ్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందే ఆ పార్టీ నేత పసుపులేటి బాలరాజు జనసేనకు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన పాడేరు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గత కొద్దిరోజులుగా బాలరాజు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చదవండి: గాజువాకలో జనసేనకు భారీ ఝలక్ ఎన్నికల అనంతరం పవన్ తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా లాంగ్ మార్చ్ సన్నహాల కోసం నిన్న జరిగిన సమావేశానికి కూడా గైర్హాజరు అయ్యారు. ఇవాళ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ఆయన తన రాజీనామా లేఖను పంపించనున్నారు. కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా ఉండి ఆ తర్వాత ఏ పార్టీలో చేరాలో బాలరాజు నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే పలువురు జనసేన పార్టీ నేతలు పార్టీని వీడిన విషయం తెలిసిందే. పవన్‌కు వామపక్షాల ఝలక్ మరోవైపు పవన్ కల్యాణ్‌కు వామపక్షాలు కూడా ఝలక్ ఇచ్చాయి. ఆదివారం విశాఖలో పవన్ నిర్వహించనున్న నిరసనకు తాము హాజరు కావడం లేదని సీపీఎం, సీపీఐ నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఓ లేఖను విడుదల చేశారు. -
కాంగ్రెస్‌కు మాజీ మంత్రి బాలరాజు రాజీనామా
పాడేరు రూరల్: కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పనుపులేటి బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శుక్రవారం ఏఐసీసీ, పీసీసీ అధ్యక్షులకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు నేపథ్యంలో టీడీపీపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత కారణంగా వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసినా డిపాజిట్ కూడా రాదనే భావనతోనే ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న బాలరాజు 1987లో ఉద్యోగానికి రాజీనామా చేసి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి జీకే వీధి మండల పరిషత్ అధ్యక్షుడిగా గెలిచారు. తర్వాత రెండేళ్లకే చింతపల్లి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో పాడేరు నుంచి గెలిచి వైఎస్ మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014 నుంచి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 30 ఏళ్లుగా ఏజెన్సీలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న బాలరాజు రాజీనామాతో ఇక ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కనుమరుగైందనే చెప్పాలి. -
'విశాఖను రాజధాని చేయడం మంచిదే'
విశాఖపట్నం: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను స్వాగతిస్తున్నామని మాజీమంత్రి పసుపులేటి బాలరాజు అన్నారు. ఆదివారం విశాఖ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాజ్యంగబద్ధంగా వ్యవహరిస్తోందని తెలిపారు. కేంద్రం నమ్మకున్న నాయకుడి వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని పరోక్షంగా కిరణ్‌కుమార్‌రెడ్డి తీరును దుయ్యబట్టారు. విశాఖను రాజధాని చేయడం మంచిదేనని, అయితే దీనిపై ప్రాంతీయ విద్వేశాలను రెచ్చగొట్టడం సరైంది కాదన్నారు. -
‘మొక్కు’బడిగా
మేడారంలో ముగ్గురు మంత్రుల పర్యటన పనుల సమయంలో కానరాని అమాత్యులు చివరి నిమిషంలో హడావుడి సాక్షి, హన్మకొండ: సార్ పస్రా నుంచి తాడ్వాయి వరకు జాతీయ రహదారికి ఇరువైపులా చేపడుతున్న సైడ్‌బర్మ్ పనులు నాసిరకంగా సాగుతున్నాయి. పక్కనున్న మట్టిని తోడి పోస్తున్నారు. దుమ్ము లేస్తోంది అని ఓ పోలీస్ అధికారి ఫిర్యాదు.. సారూ.. మా పొలాల మధ్య నుంచి బీటీరోడ్డు ఏస్తళ్లు. జాతరప్పుడు తప్పితే ఈ రోడ్డు దేనికీ పనికి రాదు. మా పొట్టకొట్టొద్దు.. అంటూ స్థానికుల వేడుకోలు. ఇవీ.. మేడారం జాతరపనులు పరిశీలించేందుకు శుక్రవారం వచ్చిన కేంద్రమంత్రి బలరాంనాయక్, రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు, జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు ఎదురైన ఘటనలు. అయినా.. అమాత్యులు అవేమీ పట్టించుకోలేదు. క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చిన మంత్రులు ఒక్క జంపన్నవాగు వంతెన పనులను మాత్రమే పరిశీలించి మిగిలిన వాటిని విస్మరించారు. ఇక సమీక్షా సమావేశాన్ని సైతం గంటన్నరలో ముగించేశారు. జాతరకు పది రోజుల వ్యవధి ఉందనగా ఎనభైశాతం పూర్తై పనుల్లో ఇప్పుడు కొత్తగా నాణ్యత తేవడం అసాధ్యం. జాతర కారణంగా స్థానికులు, గిరిజనులకు తలెత్తే ఇబ్బందులకు సంబంధించి మంత్రులు వారికి ఎలాం టి భరోసా ఇవ్వలేదు. దీంతో శుక్రవారం సాగిన మంత్రుల పర్యటన మొక్కులు చెల్లించే మొక్కుబడి పర్యటనగానే మిగిలింది. వచ్చామా.. చూశామా ... ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరంగా పేరుపొందిన సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర ఈసారి 2014 ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు జరగనుంది. ఈ జాతరకు కోటి మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో రూ.94 కోట్ల వ్యయంతో 19 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జాతర ఏర్పాట్ల పనులు జరుగుతున్నాయి. డిసెం బరు మొదటివారం నుంచే ఒక్కొక్కటిగా పనులు ప్రారంభమవుతూ వచ్చాయి. ఈ పనుల పూర్తి చేయడానికి మొద ట డిసెంబరు 31ని గడువుగా నిర్ణయించిన అధికార యంత్రాం గం చివరికి జనవరి 31కి మార్చింది. ఈ రెండు నెలల కాలంలో స్థానిక కేంద్ర మంత్రి బలరాంనాయక్, రాష్ర్ట మంత్రులు బస్వరాజు సారయ్య, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీలు రాజయ్య, సుధారాణి, ములు గు ఎమ్మె ల్యే సీతక్క డిసెంబర్ 28న మేడారం పనులను పరిశీలించారు. కాగా మన జిల్లాకే చెందిన మరో రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇటువైపు కన్నెత్తి చూడలేదు. తీరా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా పనులకు డెడ్‌లైన్ పూర్తయిన తర్వాత జనవరి 31 శుక్రవారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాలరాజు, కేంద్రమంత్రి బలరాంనాయక్‌తో కలిసి మేడారం వచ్చారు. అయితే కేంద్ర మంత్రి బలరాంనాయక్‌కు జాతర అభివృద్ధి పనుల కంటే పార్టీ పనులే ఎక్కువైనట్టు కనిపించింది. సమీక్షా సమావేశంలో కన్పించి ఆ వెంటనే బయటకు వెళ్లిపోయారు. ఇక్కడి నుంచి ఈయన మంగపేట మండలంలోని ఓ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లి.. అక్కడినుంచి వరంగల్‌కు వెళ్లినట్లు పార్టీ కార్యకర్తల ద్వారా తెలిసింది. డెడ్‌లైన్‌కు ముందు రోజుల్లో పర్యటించి పనుల్లో నాణ్యత, వేగాన్ని పెంచాల్సిన అమాత్యులు.. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు పర్యటించేనాటికి అన్ని ప్రధాన విభాగాల్లో పనులు ఎనభైశాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులు మధ్యలో ఉన్నాయి. ఈ దశలో మంత్రులు ఇచ్చే సూచనలు అమల్లోకి తేవడం ఏమేరకు సాధ్యమో వారికే తెలియాలని ఆదివాసీలు అంటున్నారు. రూ.94 కోట్ల విలువైన పనులపై గంటన్నరలో సమీక్ష నిర్దేశించిన గడువునాటికి ప్రధాన విభాగాల ఆధ్వర్యంలో పనులు ఎనభైశాతానికి పైగా పూర్తయ్యాయి. ఈ దశలో మంత్రులు జనవరి 31న మేడారంలో పర్యటించారు. మధ్యహ్నం 1:30 గంటలకు జంపన్నవాగు వద్దకు చేరుకుని కొత్త వంతెన నిర్మాణ పనులు పరిశీలించారు. 2:40 గంటలకు సమ్మక్క-సారలమ్మ గ ద్దెల వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు సమీక్షా సమావేశం ప్రారంభించి సాయంత్రం 4:30 గంటలకు ముగించారు. కోటి మంది భక్తుల అవసరాలు తీర్చేందుకు రూ.94 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన సమీక్షను కేవలం గంటన్నర వ్యవధిలో ముగించారు. సమీక్షలో చర్చకురాని కీలక అంశాలు సమ్మక్క-సారలమ్మ జాతర పూర్తిగా గిరిజన జాతర. గత జాతర సందర్భంగా నియమించిన పాలకమండలి కాలపరిమితి 2014 జనవరి 8 నాటికి ముగిసింది. కొత్తపాలక మండలి ఏర్పాటు చేసేందుకు సమయం సరిపోకపోతే కనీసం తాత్కాలిక కమిటీ ఏర్పాటు విషయాన్ని సాక్షాత్తు గిరిజన సంక్షేమ శాఖమంత్రితో పాటు కేంద్రమంత్రి బలరాం నాయక్ సైతం విస్మరించారు. మాటమాత్రంగానైనా ఈ అంశానికి సమీక్షలో చోటు కల్పించలేదు. ఆఖరికి ఊరట్టం నుంచి జంపన్నవాగు రోడ్డు వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డు వల్ల తమ భూములు కోల్పోతున్నాము.. తమకు న్యాయం చేయాలంటూ మొరపెట్టుకున్న బాధితులకు స్పష్టమైన హామీ లభించలేదు. రూ.10 కోట్లతో నిర్మిస్తున్న స్నానఘట్టాలు, కోటి రూపాయలతో నిర్మిస్తున చిలకలగుట్ట చుట్టూ ఫెన్సింగ్ వంటి కీలక పనులు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లలేదు. జాతర పనుల పర్యవేక్షణ విషయంలో తమకేమీ పట్టనట్లు వ్యవహరించిన జిల్లా మంత్రులు సమీక్షా సమావేశంలో చివరల్లో.. వచ్చేసారి జరిగే జాతరకు సంబంధించినపనుల ప్రతిపాదనలు 2014 మార్చి 31 నాటికి ప్రభుత్వానికి పంపించాలంటూ అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడం కొసమెరుపు. -
బాలరాజు తెలంగాణం
అసెంబ్లీలో విభజనవాదం వినిపించిన మంత్రి రగిలిపోతున్న సమైక్యవాదులు తగినపాఠం చెబుతామంటూ హెచ్చరిక సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : పాడేరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖామంత్రి పసుపులేటి బాలరాజుపై నిరసనలు వెల్లువెత్తాయి. రాష్ట్ర విభజన బిల్లుపై బుధవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో బాల రాజు తెలం‘గాణం’ వినిపించారు. తాను విభజనకు అనుకూలమని పాతపల్లవి అందుకున్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించడం జిల్లావాసుల్లో ఆగ్రహాన్ని రగిల్చింది. సమైక్య ఉద్యమాలు జరుగుతున్న తరుణంలో నియోజక వర్గ ప్రజల అభీష్టం పేరిట బాలరాజు ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా మాట్లాడడాన్ని ఇక్కడి వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అసెంబ్లీలో బాలరాజుకు టీఆర్ఎస్ శాసనసభ్యులు మద్దతు పలకడం విశాఖ వాసులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంత ప్రయోజనాల కంటే పదవికే బాలరాజు అధిక ప్రాధాన్యతనిచ్చి మాట్లాడారంటూ నగరంలోని ఎంపీపీ డబుల్ రోడ్ జంక్షన్లో సమైక్యవాదులు బుధవారం రాత్రి ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. గతంలో కాంగ్రెస్ టికెట్ లభించకపోవడంతో పార్టీని ధిక్కరించి రెండు పర్యాయాలు రెబల్‌గా బరిలోకి దిగి క్రమశిక్షణ చర్యలకు గురైన ఈ గిరిజనమంత్రి తాజాగా పార్టీ నిర్ణయమే శిరోధార్యమనడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని ఇక్కడి సమైక్యవాదులు దుయ్యపడుతున్నారు. బాలరాజు తన ప్రత్యేక తెలంగాణ అనుకూల నిర్ణయాన్ని మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని సమైక్యాంధ్రా విద్యార్ధి జేఏసీ హెచ్చరించింది. ఐఏ ఎస్ పదవిని వదులుకొని ఇటీవల పార్టీలో చేరిన కొప్పుల రాజు సూచనల మేరకే బాల రాజు తెలంగాణకు మద్దతుగా వ్యవహరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి బుధవారం నాటి సంఘటన బలం చేకూర్చింది. తెలంగాణకు మద్దతు ప్రకటించిన బాలరాజు ఆ ప్రాంతానికి వలసపోవడం మంచిదని, ఆయన క్షమాపణ చెప్పి సమైక్యం అనకుంటే రానున్న ఎన్నికల్లో గట్టిగా బుద్ధిచెబుతామని సమైక్యాంధ్రా రాజకీయ ఐకాస నేత జేటీ రామారావు ఒక ప్రకటనలో హెచ్చరించారు. -
నా బాధలు ‘గ్రీవెన్స్‌డే’లో చెప్పుకోమంటారా?
సాక్షి, హైదరాబాద్: నేను మంత్రినన్న విషయాన్ని పక్కనబెడితే కనీసం ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేనన్న విషయాన్ని కూడా మర్చిపోతే ఎలా? అని రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి పసుపులేటి బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో సోమవారం జరిగిన గిరిజన ఉప ప్రణాళిక (టీఎస్పీ) నోడల్ ఏజెన్సీ సబ్‌ప్లాన్ సమావేశంలో భాగంగా మంత్రి బాలరాజు అధికారుల వ్యవహారశైలిని ప్రశ్నిస్తూనే.. ముఖ్యమంత్రితో నెలకొన్న వివాదం విషయంలో పరోక్షంగా రుసరుసలాడారు. ‘‘గత మే నెలలో నేను, బీసీ మంత్రి కలసి విశాఖ జిల్లా కొయ్యూరు మండలం కొమ్మిక గ్రామానికి వచ్చాం. మా కార్యక్రమంలో ఎవరూ పాల్గొనకుండా లబ్ధిదారులందరినీ చేరదీసి సెర్ప్ అధికారులు వేరే గ్రామంలో సమావేశం పెట్టారు. దీనిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు దిక్కులేదు. నా బాధలు గ్రీవెన్స్‌డేలో చెప్పుకొమ్మంటారా’’ అని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. -
నేటి నుంచి రచ్చబండ
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో నేటి నుంచి 26 వరకు మూడో విడత రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. తొలుత ఇల్లెందు నియోజకవర్గం టేకులపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఉద్యానవన శాఖా మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభిస్తారని కలెక్టర్ ఐ.శ్రీనివాస శ్రీనరేష్ తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పసుపులేటి బాలరాజు హాజరు కావడం లేదు. ఇన్చార్జి మంత్రిగా నియామకం అయిన ఆయన జిల్లా సమస్యలపై ఒక్కసారి డీఆర్సీ నిర్వహించారు. అనంతరం ఇప్పటివరకు ఏ సమస్య పరిష్కారానికీ చొరవ చూపలేదు. రచ్చబండ కార్యక్రమ నిర్వహణ ముందు జిల్లాకు వచ్చి ఈ మూడో విడతలో చేపట్టే కార్యక్రమాలను వివరించి వెళ్లారు. రచ్చబండకు హాజరవుతారని అందరూ ఊహించినప్పటికీ ఆయన డుమ్మా కొట్టారు. తరువాత జరిగే కార్యాక్రమాల్లో పాల్గొంటానని చెప్పినట్లు సమాచారం. టేకులపల్లిలో నిర్వహించే రచ్చబండలో కేంద్ర సామాజిక న్యాయ సహాయ మంత్రి పోరిక బలరామ్‌నాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు. రచ్చబండ నిర్వహణ వివరాలు... ఇల్లెందు నియోజకవర్గంలో టేకులపల్లిలో 11న, 18న గార్ల, 19న బయ్యారం, 15న కామేపల్లి, 22న ఇల్లందు, 23న ఇల్లందు మున్సిపాలిటీ, పినపాక నియోజకవర్గంలో 15న గుండాల, 18న పినపాక, 19న మణుగూరు మున్సిపాలిటి, 20 అశ్వాపురం, 21 మణుగూరు, 22న బూర్గంపహాడ్, పాలేరు నియోజకవర్గంలో 18న ఖమ్మం రూరల్, 19న తిర్మలాయపాలెం, 20న నేలకొండపల్లి, 22న కూసుమంచి, ఖమ్మం నియోజకవర్గంలో 18న ఖమ్మం , రఘనాధపాలెం, 20న ఖమ్మం కార్పొరేషన్లో, మధిర నియోజకవర్గంలో 22న ఎర్రుపాలెం, 23న మధిర, 24న చింతకాని, 25న బోనకల్లు, 26న ముదిగొండ, వైరా నియోజకవర్గంలో 21న ఏన్కూర్, 23న జూలూరుపాడు, 18న కొణిజర్ల, 25న సింగరేణి, 19న వైరా, సత్తుపల్లి నియోజకవర్గంలో 15న సత్తుపల్లి, 16న సత్తుపల్లి మున్సిపాలిటి, 18న వేసూరు, 20న తల్లాడ, 22న కల్లూరు, 25న పెనుబల్లి, కొత్తగూడెం నియోజకవర్గంలో 18న పాల్వంచ మున్సిపాలిటి, 19న పాల్వంచ, 21న కొత్తగూడెం, అశ్వారరావుపేట నియోజకవర్గంలో 15న వేలేరుపాడు, 19న ముల్కలపల్లి, 21న చండ్రుగొండ, 22న దమ్మపేట, 23న కుక్కునూరు, 25న అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గంలో 11న వాజేడు, 12న చింతూరు, 14న వీఆర్‌పురం, 15న వెంకటాపురం, 19న చర్ల, 20న భద్రాచలం, 22న దుమ్ముగూడెం, 23న కూనవరంలో నిర్వహించనున్నారు. -
రోడ్లు మరమ్మతు చేయలేకపోయాం
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: నీలం తుపాన్‌తో దెబ్బతిన్న రోడ్ల ప్రతిపాదనలు ఇప్పటి వరకు ప్రభుత్వానికి పంపకపోవడంతో వాటిని మరమ్మతు చేయలేకపోయామని, ఈ విషయంలో జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లిందని జిల్లా ఇన్చార్జి మంత్రి పసుపులేటి బాలరాజు అన్నారు. మూడో విడత రచ్చబండ ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్యం వల్లే దెబ్బతిన్న రోడ్లుకు అవసరమైన మరమ్మతులు చేపట్టలేకపోయామన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని ఇంజినీరింగ్ శాఖల అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలు, మండల స్థాయిలో నిర్వహించే రచ్చబండ సమావేశాలలో 42,096 మందికి రేషన్‌కార్డులు, 26,878 మందికి పింఛన్లు, 61,958 కుటుంబాలకు ఇళ్లు, దీపం పథకం కింద మూడు వేల మందికి గ్యాస్ కనె క్షన్లు, బంగారుతల్లి పథకం కింద 1817 మంది లబ్ధిదారులకు మంజూరు ధ్రువపత్రాలు పంపిణి చేయనున్నట్లు వివరించారు. 50 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించిన ఎస్సీ, ఎస్టీల వారికి రూ.10.71 కోట్ల రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇందిరమ్మ కలలు కార్యక్రమం ప్రతి మండలంలో ఒక కమ్యూనిటీ హాలు నిర్మిస్తామని, ఒక్కో భవనానికి రూ. 7.50 లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలతో, నకిలీ విత్తనాలతో జరిగిన పంట నష్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు న్యాయం జరిగేలా సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఉద్యానవన శాఖామంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. బంగారుతల్లి పథకాన్ని అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పథకం అమలులో అలసత్వం వహించి, లబ్ధిదారులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మూడో విడత రచ్చబండ కాార్యక్రమంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులందరూ పాల్గొనాలని కోరారు. డిప్యూటి స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిసుృన్న రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో కలెక్టర్ ఐ.శ్రీనివాస శ్రీనరేష్, జేసీ సురేంద్రమోహన్, ఐటీడీఏ పీఓ వీరపాండియన్, ఎమ్మెల్యేలు తుమ్మల నాగేశ్వరరావు, రేగా కాంతారావు, సండ్ర వెంకట వీరయ్య, వగ్గెల మిత్రసేన, బాణోత్ చంద్రావతి, కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఏజేసీ బాబురావు ,జిల్లా రెవెన్యూ అధికారి శివ శ్రీనివాస్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. -
తూతూ మంత్రం..!
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రచ్చబండ సమీక్ష సమావేశం నాలుగు గోడలకే పరిమితమైంది. కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా ఇన్చార్జి మంత్రి పసుపులేటి బాలరాజు అధ్యక్షతన శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పలువురు ఎమ్మెల్యేలు, వివిధ శాఖల అధికారులు హాజరైన ఈ సమావేశం డీఆర్సీని తలపించినప్పటికీ.. ప్రజా సమస్యలు పెద్దగా ప్రస్తావించలేదు. మీడియాను సైతం అనుమతించలేదు. దీనిపై సత్తుపల్లి, కొత్తగూడెం ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కూనంనేని సాంబశివరావు అధికారులతో వాగ్వాదానికి దిగారు. సమీక్ష సమావేశంలో రహస్యాలేమీ ఉండవని, అలాంటప్పుడు మీడియాను ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మాట్లాడిన విషయాలు మాత్రమే ప్రకటనల ద్వారా వెల్లడిస్తారా అని డీపీఆర్ఓను నిలదీశారు. అసెంబ్లీలో సైతం మీడియాను అనుమతిస్తారని, ఇక్కడ రానీయకపోవడం సరైంది కాదని అన్నారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండానే ర చ్చబండలో ప్రజలకు అందించే సంక్షేమ కార్యక్రమాల వివరాలను ఇన్చార్జి మంత్రి బాలరాజు వివరించి ముగించారు. వరుస తుపాన్లు, వరదలతో పంటలకు నష్టం వాటిల్లినా.. చేపట్టాల్సిన చర్యలపై సమీక్షలో చర్చించకపోవడం గమనార్హం. ఏడాది తర్వాత జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో నిర్వహించిన ఈ సమావేశం సాదాసీదాగా ముగియడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీలం తుపాన్‌తో దెబ్బతిన్న రోడ్లను ఇంతవరకూ మరమ్మతు చేయలేదని, ప్రజాసమస్యలు పరిష్కారం కావడం లేదని, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని, ఈ పరిస్థితిలో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని పలువురు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. సమీక్ష నుంచి తుమ్మల వాకౌట్... ప్రభుత్వ తీరుపై ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు విమర్శలు గుప్పించారు. గత సమీక్షలో ఇచ్చిన హమీలు ఏ ఒక్కటీ అమలు కాలేదని ఆరోపించారు. ప్రభుత్వ పనితీరు వల్ల ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలకు విశ్వాసం లేకుండా పోతోందన్నారు. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని, తుపాన్ వచ్చి 15 రోజులు దాటినా ఇప్పటికీ పంట నష్టం సర్వే పూర్తి కాలేదని వాపోయారు. ఇన్ చార్జి మంత్రి జిల్లాకు రారని, ఉన్నవారు పట్టించుకోరని ఆరోపించారు. జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లినా పట్టించుకోకుంటే ఇక ప్రభుత్వం ఎందుకని ప్రశ్నిస్తూ.. సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. -
విశాఖ వన్డేపై గంటా, పసుపులేటి మాటల యుధ్దం
విశాఖపట్టణం: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈనెల 24న వైజాగ్‌లో జరగనున్న వన్డే మ్యాచ్‌పై రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, పి. బాలరాజు మాటల యుద్ధం మొదలు పెట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న నేపథ్యంలో మ్యాచ్‌ను అడ్డుకుంటామని గంటా చెబుతుండగా, పటిష్ట భద్రతతో షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ నిర్వహిస్తామని బాలరాజు అంటున్నారు. సీమాంధ్ర ప్రజలందరూ రోడ్డుమీదకు వచ్చి ఉద్యమాలు చేస్తున్నారని, క్రికెట్‌ను ఆస్వాదించడానికిది సమయం కాదని గంటా పేర్కొన్నారు. ఈ మేరకు బీసీసీఐకి లేఖ కూడా రాసినట్టు చెబుతున్నారు. ఉద్యమాలతో అట్టుడుకుతుంటే క్రికెట్ మ్యాచ్ ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే గంటా వ్యాఖ్యలను బాలరాజు తప్పుబట్టారు. ఇక్కడ మ్యాచ్ నిర్వహిస్తే వైజాగ్ ఇమేజ్ మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. భారత్, విండీస్ వన్డే ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మ్యాచ్‌ను అడ్డుకోవద్దని గంటాను కోరారు. సమైక్య ముసుగులో గంటా రాజకీయ ప్రయోజనం కోసం పాకులాడుతున్నారన్న గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇద్దరు మంత్రుల రాజకీయాల నేపథ్యంలో మ్యాచ్ జరుగుతుందో, లేదోనని క్రికెట్ అభిమానులు కంగారు పడుతున్నారు. భారత్, విండీస్ జట్ల మధ్య ఈ నెల 24న రెండో వన్డే జరగాల్సివుంది. -
గిరిజన ప్రాంతాల్లో లీజుల రద్దు
సాక్షి, హైదరాబాద్: గిరిజన ప్రాంతాల్లో ఇప్పటివరకు మంజూరు చేసిన మైనింగ్ లీజులను పునఃసమీక్షించి వాటన్నింటినీ వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సలహా మండలి (ఏపీటీఏసీ) రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. గిరిజన సంక్షేమ మంత్రి పసుపులేటి బాలరాజు నేతృత్వంలో మంగళవారం జరిగిన టీఏసీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. సమావేశానికి గిరిజన ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, ఊకె అబ్బయ్య, కుంజా సత్యవతి, ధనసరి అనసూయ, రాజన్నదొర, సత్యనారాయణరెడ్డి, మిత్రసేన, నిమ్మక సుగ్రీవులు, నగేశ్ హాజరయ్యారు. గిరిజన ప్రాంతాల్లోని బాక్సైట్, లేటరైట్ మైనింగ్ లీజు లపై వాడివేడి చర్చ జరిగింది. అధికారులు గిరిజన హక్కులను కాలరాస్తూ.. లీజుల పేరిట భూములిచ్చి బినామీలు దోచుకునేందుకు దోహదపడుతున్నారని ఎమ్మెల్యేలు సక్కు, అబ్బయ్య, రాజన్నదొర ఆరోపించారు. లీజు కింద వస్తున్న రాయల్టీ ఎవరి అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. లీజులన్నింటినీ రద్దు చేయాలని కేంద్ర మంత్రి కిశోర్‌చంద్రదేవ్ స్వయంగా లేఖ రాశాక కూడా లీజుకు అనుమతి ఎందుకిచ్చారని నిలదీశారు. మైనింగ్ లీజులకు 5 కిలోమీటర్ల పరిధిలో గిరిజన ఆవాసాలే లేవని అధికారులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. ఖనిజాల తవ్వకాలకోసం బినామీలకు లీజుకివ్వకుండా స్థానిక గిరిజనులను ప్రోత్సహించి, వారితో పరిశ్రమలు పెట్టించి ఉపాధి కల్పించేలా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సభ్యులందరి ఏకగ్రీవ ఆమోదంతో గిరిజన ప్రాంతాల్లోని లీజుల న్నింటినీ రద్దు చేయాలని సమావేశం తీర్మానించింది. సబ్‌ప్లాన్ పనుల్లో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం.. ఎస్టీ ఉపప్రణాళిక చట్టం కాంట్రాక్టర్లకు చుట్టంగా మారిందని సభ్యులు ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా పనుల ప్రతిపాదనలను పంపి వాటికి ఆమోదం తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఇక నుంచి సబ్‌ప్లాన్ కింద చేపట్టే పనుల్లో స్థానిక ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇవ్వాలని, వారి సిఫారసు మేరకే పనుల ప్రతిపాదనలు రూపొందించాలంటూ తీర్మానించారు. ఇక ‘మందుల’ కులాన్ని ఎస్టీల జాబితా లో చేర్చాలనే అధికారుల ప్రతిపాదనను సమావేశం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ముందు ఎస్టీలలో ఉన్న గిరిజనుల జీవన పరిస్థితులు చక్కదిద్దాకే, కొత్త కులాలను చే ర్చే విషయం ఆలోచిద్దామని సభ్యులు చెప్పారు. సభ్యుల అభిప్రాయాలతో మంత్రి కూడా ఏకీభవించడంతో మందుల కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అంగీకరించవద్దని, మున్ముందు ఇలాంటి ప్రతిపాదనలను ప్రోత్సహించవద్దని తీర్మానించారు. ఎమ్మెల్యేలు సత్యవతి రాథోడ్, సుమన్‌రాథోడ్, తెల్లం బాలరాజును కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా టీఏసీ సమావేశాలకు అహ్వానించాలని తీర్మానించారు. గిరిజన హక్కులు కాలరాస్తున్నారు: బాలరాజు సమావేశానంతరం మంత్రి బాలరాజు మీడియాతో మాట్లాడుతూ.. గిరిజనుల భవిష్యత్తు తరాల ప్రయోజనాలదృష్ట్యా గిరిజన ప్రాంతాల్లోని మైనింగ్ లీజుల ను రద్దు చేయాలని తీరానించినట్లు చెప్పారు. రాష్ట్రం లో గిరిజన అభివృద్ధి మండలి ఏర్పాటు చేయాలని, జీసీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గు ర్తించాలని, 800 గ్రామాలను షెడ్యూలు ఏరియాలో నోటిఫై చేయాలని కూడా తీర్మానించినట్లు చెప్పారు. -
పారిశ్రామిక రంగంలో రాష్ట్రానిది రెండో స్థానం
రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖామంత్రి గీతారెడ్డి సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండోస్థానంలో ఉందని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ జె. గీతారెడ్డి చెప్పారు. ఎస్సి, ఎస్టి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఇగ్నైట్ పేరుతో హైదరాబాద్‌లో బుధవారం జరిగిన 21రోజుల శిక్షణా తరగతుల ప్రారంభ కార్యక్రవుంలో గీతా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ (నిమ్స్ మే)లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ పదేళ్ళ కిందట పరిశ్రమ రంగంలో ఏడో స్థానంలో ఉన్న రాష్ట్రం రెండోస్థానానికి ఎదగడం గర్వకారణమని, త్వరలోనే ప్రథమస్థానాన్ని కైవసం చేసుకుంటుందని అన్నారు. కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి జె.డీ. శీలం మాట్లాడుతూ పారిశ్రామిక రంగంలో పలువురికి ఉద్యోగాలు కల్పించేస్థాయికి దళితులు ఎదగాలన్నారు. రాష్ట్ర మంత్రులు డొక్కా మాణిక్య వరప్రసాద రావు, కొండ్రు మురళీ మోహన్, పసుపులేని బాలరాజు మాట్లాడారు.