మోదమాంబ ఉత్సవాల్లో విషాదం.. | In Visakhapatnam Modamamba Festival Girl Died Falling From Giant Wheel | Sakshi
Sakshi News home page

జెయింట్‌ వీల్‌ పైనుంచి పడి బాలిక మృతి

Published Tue, May 14 2019 12:54 PM | Last Updated on Tue, May 14 2019 7:00 PM

In Visakhapatnam Modamamba Festival Girl Died Falling From Giant Wheel - Sakshi

సాక్షి, విశాఖపట్నం :  జిల్లాలోని పాడేరులో జరుగుతున్న మోదమాంబ ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉత్సవాలను చూడటానికి వచ్చిన ఓ బాలిక మృతి చెందటంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాలు.. భవాని(16) అనే బాలిక ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన జెయింట్ వీల్ ఎక్కింది. అయితే జెయింట్ వీల్ వేగంగా తిరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా ఆమెకు కళ్లు తిరిగాయి. దాంతో ఆమె పైనుంచి కింద పడింది. తల నేరుగా నేలను తాకడంతో ఆమెకు గాయాలు అయ్యాయి.

వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు బాలికను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భవాని ఈ రోజు మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి కూడా గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు. చనిపోయిన భవానిది వి.మాడుగుల మండలం గరికబంద గ్రామంగా గుర్తించారు.

సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : 
జెంయింట్‌వీల్ నుంచి జారిపడి యువతి మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement