విశాఖలో మారథాన్‌ను ప్రారంభిస్తున్న డీజీపీ గౌతమ్ సవాంగ్, ఈఎన్‌సీ స్టాఫ్ చీఫ్ వైస్ అడ్మిరల్ గోర్మడే
విశాఖ స్పోర్ట్స్: తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో వైజాగ్ నేవీ మారథాన్ విశాఖ సాగర తీరంలో ఆదివారం ఉదయం ఉత్సాహంగా సాగింది. మారథాన్‌ను తూర్పు నావికాదళ కమాండింగ్ చీఫ్ వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్, స్టాఫ్ చీఫ్ వైస్ అడ్మిరల్ గొర్మాడేతో కలసి రాష్ట్ర పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. కరేజ్ రన్ పేరిట 42.2 కిలోమీటర్ల మేరకు సాగిన మారథాన్‌లో 458 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. డెస్టినీ రన్ కింద 21.1 కిలోమీటర్ల మేరకు కొనసాగిన హాఫ్ మారథాన్‌లో 2,739 మంది అథ్లెట్లు ఉత్సాహంగా పరుగు తీశారు. అలాగే ఫ్రెండ్‌షిప్ రన్‌గా పది కిలోమీటర్ల మేరకు సాగిన పరుగులో 5,850 మంది పాల్గొనగా.. ఐదు కిలోమీటర్ల పరుగులో 10,061 మంది పాల్గొన్నారు.
విజేతలు వీరే..
మారథాన్ మెన్ కేటగిరీలో ఫెలిక్స్ చిరిమోత్ రాబ్ విజేత కాగా మోహిత్ రాథోర్ రన్నరప్‌గా నిలిచాడు. హాఫ్ మారథాన్‌లో నికోడిమస్ కిప్రుగట్ గెలుపొందగా.. మోసెస్ కిప్టానియా రన్నరప్‌గా వచ్చాడు. మారథాన్ మహిళా విభాగంలో ఎట్రేగెనట్ బెలెటే విజేత అవగా, సెల్లీ జెబివుట్ రన్నరప్‌గా నిలిచింది. హాఫ్ మారథాన్ మహిళా విభాగంలో కరెన్ జబెట్ విజేత అవగా ఫూలన్ పాల్ రన్నరప్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment