విశాఖపట్నం స్టీల్ప్లాంటుకు చెందిన ఓ సీనియర్ అధికారి భువనేశ్వర్లో అనుమానస్పద స్థితిలో మరణించారు. ఫైనాన్స్ విభాగంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న ఐ.సూర్యప్రకాశరావు హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఆయన మృతదేహం ఓ డంప్ యార్డు సమీపంలోప కనిపించింది. ఆయన తలపై గట్టి వస్తువుతో కొట్టినట్లు గాయాలున్నాయని పోలీసులు తెలిపారు.
భువనేశ్వర్ లోని వీఎస్ఎస్ నగర్ ప్రాంతంలోగల ఆంజనేయస్వామి గుడి ఎదురుగా ఆయన మృతదేహం పడి ఉండగా స్థానికులు గుర్తించారు. అనంతరం కేపిటల్ ఆస్పత్రికి ఆయన మృతదేహాన్ని తరలించి అక్కడ పోస్టు మార్టం నిర్వహించారు. ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని చెప్పినట్లు ఏసీపీ దిలీప్ కుమార్ దాస్ తెలిపారు. సూర్యప్రకాశరావుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని, దానికి సంబంధించిన గొడవల్లోనే ఆయన హత్యకు గురై ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా, సూర్యప్రకాశరావుతో పాటు కలిసి ఉండే కోటేశ్వరరావు అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఒడిషాలో వైజాగ్ స్టీల్ప్లాంట్ అధికారి హత్య
Published Mon, Jan 5 2015 5:07 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement