61మంది వీఆర్‌ఏల నియామకం
గుడివాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో వీఆర్‌ఏలుగా ఎంపికైన 61 మంది అభ్యర్థులకు ఆర్డీవో ఎస్.వెంకటసుబ్బయ్య నియమామక పత్రాలను అందించారు. డివిజన్‌లోని అన్ని మండలాల అభ్యర్థుల సర్టిఫికెట్లను ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం పరిశీలించారు.

డివిజన్‌లో 104 ఖాళీలకు 21 చోట్ల అభ్యర్థులు ఎవ్వరూ దరఖాస్తు చేసుకోలేదు. 83 మంది మొదటి ర్యాంకు పొందిన వారిని పిలువగా వారిలో 61 మంది మాత్రమే అర్హత సాధించారని ఆర్డీవో వెంకటసుబ్బయ్య తెలిపారు. అర్హత కలిగిన ఇద్దరు అభ్యర్థులు తమకు ఈ ఉద్యోగం అవసరం లేదని తిరస్కరించారని పేర్కొన్నారు. మరో 11 మందిని సర్టిఫికెట్లు సరిగాలే నందున తిరస్కరించామని, 8 మంది గైర్హాజరయ్యారని వెంకటసుబ్బయ్య చెప్పారు.
గుడివాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని గుడివాడ, కైకలూరు, పామర్రు నియోజక వర్గాల నుంచి ఇటీవల నిర్వహించిన పరీక్షలో ఆయా గ్రామాల్లో మొదటి ర్యాంకు సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించిన అనంతరం 61 మంది అర్హులను గుర్తించి, ఉద్యోగాల్లో నియమించామని వివరించారు. అభ్యర్థులు తిరస్కరణకు గురైన, అర్హులు ఉద్యోగం వద్దన్న, గైర్హాజ రయిన వారి స్థానంలో రెండో ర్యాంకు పొందిన వారిని సర్టిఫికెట్ల పరిశీలనకు త్వరలో పిలుస్తామని చెప్పారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ తేదీ నిర్ణయిస్తామని పేర్కొన్నారు. సర్టిఫికెట్ల పరిశీ లనలో ఆయా మండలాల తహశీల్దార్లు, ఆర్డీవో కార్యాలయ డీటీ సాంబశివరావు పాల్గొన్నారు