సాక్షి, కర్నూలు : శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద నీరు తగ్గుతోంది. ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల నుంచి 7,19,725 క్యూసెక్కుల వరదనీరు విడుదల కాగా శ్రీశైలం డ్యామ్‌కు మొత్తం 7,73,917 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. 10 గేట్ల ద్వారా 8,60,012 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.60 అడుగులకు చేరుకుంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.0114 టీఎంసీల నీరు ఉంది.
జూరాల : రికార్డు స్థాయిలో జూరాల నుంచి శ్రీశైలానికి ఇప్పటికే 555.641 టీఎంసీలు నీరు చేరింది. ప్రాజెక్టు నీటి వివరాలు..
ఇన్ ఫ్లో : 7,20,000 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 7,19,725 క్యూసెక్కులు
ప్రస్తుత నీటి నిల్వ : 5.943 టీఎంసీలు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 9.657 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ మట్టం : 316.500 మీటర్లు
పూర్తిస్థాయి నీట్టి మట్టం: 318.516 మీటర్లు
Comments
Please login to add a commentAdd a comment