
రాయల ఒప్పుకోం
సాక్షి నెట్‌వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 125వరోజూ సోమవారం సీమాంధ్ర జిల్లాల్లో కొనసాగింది. రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ చిత్తూరులో ఉపాధ్యాయులు రాస్తారోకో చేశారు. తిరుపతిలో సమైక్యవాదులు తలలపై కుర్చీలు పెట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలి పారు. మదనపల్లెలో జేఏసీ నేతలు సదస్సు నిర్వహించి విభజన వల్ల రాయలసీమకు జరిగే అన్యాయాన్ని విద్యార్థులకు వివరించారు. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం గవరవరంలో విద్యార్థులు ‘వుయ్ హేట్ టీ బిల్’ అక్షరాకృతిలో కూర్చుని కేంద్రప్రభుత్వ తీరుపై నిరసనృవ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోరుతూ పాలకొల్లు, నరసాపురం, మార్టేరు పట్టణాల్లో రిలేదీక్షలు కొనసాగాయి. కృష్ణాజిల్లా కలిదిండిలో కేంద్ర హోంమంత్రి షిండే దిష్టిబొమ్మను దహనం చేశారు. అవనిగడ్డలో దీక్షలు 100వ రోజుకు చేరిన సందర్భంగా 100మంది విద్యార్ధులు ఒకరోజు దీక్ష చేపట్టారు.