కృష్ణా డెల్టాకు నీటి విడుదల పొడిగింపుపై తెలంగాణ ప్రభుత్వ నిరసన కేంద్ర జల సంఘానికి లేఖ
హైదరాబాద్: ‘మా అవసరాలకూ నీటిని విడుదల చేయండి. నల్లగొండ ప్రజల తాగునీటి కోసం 3 టీఎంసీల నీరు కావాలి. మేం వద్దన్నా.. మాతో సంప్రదించకుండా డెల్టాకు నీటిని ఎలా విడుదల చేస్తారు ? దీనిపై మేం నిరసన వ్యక్తం చేస్తున్నాం’ అంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలసంఘానికి లేఖ రాసింది. బోర్డు నిర్ణయం మేరకు కృష్ణాడెల్టా తాగునీటి అవసరాల కోసం గత నెల 25 నుంచి రోజూ 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. గడువు మంగళవారంతో ముగియడంతో ఏపీ వినతి మేరకు ఈ నీటి విడుదలను మరో వారం పాటు కొనసాగించారు. దీనిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేఖిస్తోంది. ఒకవేళ నీటి విడుదలను పొడిగించాలంటే బోర్డు సమావేశమై తమతో కూడా చర్చించాలని కోరింది. తెలంగాణ రాష్ట్ర వాదనను బోర్డు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో బుధవారం నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులతో పరిస్థితిని సమీక్షించారు.
కేంద్రానికి నిరసనను వ్యక్తం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవిందరెడ్డి కేంద్ర జలసంఘం ఇన్‌చార్జి చైర్మన్ ఏబీ పాండ్యాకు బుధవారం లేఖను రాశారు. మాతో చర్చించకుండానే డెల్టాకు నీటి విడుదలను పొడిగించడం అన్యాయమని నిరసనను వ్యక్తం చేశా రు. నల్లగొండ జిల్లా ప్రజల తాగునీటి అవసరాలకు 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆ లేఖలో కోరారు. డెల్టా నీటి విషయంలో ఏపీ ప్రభుత్వం తప్పు డు సమాచారం ఇస్తోందని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ నుంచి డెల్టాకు నీరు వెళ్లడానికి కొంత సమ యం పడుతుందన్న విషయాన్ని గుర్తుచేశారు. మధ్య లో ఉన్న పులిచింత ప్రాజెక్టు వద్ద కూడా కొంత నిలిచి నెమ్మదిగా దిగువకు వెళుతుందని పేర్కొన్నారు.
మేం వద్దన్నా నీళ్లెలా ఇస్తారు?
Published Thu, Jul 3 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM
Advertisement
Advertisement