పుట్టపర్తి విమానాశ్రయాన్ని కొంటాం
శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: పుట్టపర్తి విమానాశ్రయాన్ని కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రూ.73 కోట్లు చెల్లించేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్య కారద్యర్శి కె.చక్రవర్తికి రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ(ఇన్‌క్యాప్) మేనేజింగ్ డెరైక్టర్ రమేశ్ కుమార్ సుమన్ రెండు రోజుల క్రితం లేఖ రాశారు. అయితే ఈ లేఖపై సత్యసాయి ట్రస్టు ఇంకా స్పందించాల్సి ఉంది. పుట్టపర్తి సాయిబాబా మరణానంతరం విమానాశ్రయానికి ప్రయాణికుల రద్దీ తగ్గిపోయింది.
విమాన సర్వీసులు కూడా నడవని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పుట్టపర్తి విమానాశ్రయాన్ని విక్రయించాలని శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వం రూ.73 కోట్లకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది.పుట్టపర్తి విమానాశ్రయాన్ని కొనుగోలు చేయడం ద్వారా అక్కడ ఏవియేషన్ అకాడమీతో పాటు పెలైట్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.