టెన్త్ ఫలితాలపై మంత్రి గంటా సంచలన వ్యాఖ్యలు
విశాఖ: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రైవేటు విద్యాసంస్థల్లో 10 జీపీఏ(గ్రేడింగ్ పాయింట్ యావరేజ్) అనూహ్యంగా మూడు రెట్లు పెరగడంపై దర్యాప్తు చేయిస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సంచలన ప్రకటన చేశారు. శనవారం విశాఖపట్నంలో ఫలితాలు విడుదల చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. టెన్త్ పేపర్ల లీకేజీలో టీడీపీ మంత్రుల ప్రమేయంపై పెద్ద స్థాయిలో విమర్శలు చెలరేగిన నేపథ్యంలో మంత్రి ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
మంత్రి చెప్పినదాని ప్రకారం ఏ స్కూళ్లలో జీపీఏ గతంలోకంటే మూడు రెట్లు అదనంగా పెరిగాయో వాటిపై విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మంత్రి గంటా చేసిన ఈ ప్రకటన రాష్ట్రంలో పెను ధుమారం రేపే అవకాశం ఉంది. మంత్రులకు సంబంధించిన స్కూళ్లలోనే లీకేజీ జరిగిందని ఆధారాలతో సహా బయటపడిన నేపథ్యంలో.. విచారణ నిర్ణయంపై మిగిలిన ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు ఏ విధంగా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
(‘నారాయణ’ సంస్థల నుంచే టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ)
మొన్నటికి మొన్న పదో తరగతి పరీక్ష పేపర్లు లీకులయ్యాయని వార్తలు హల్‌చల్ చేయడంతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని దాదాపుగా ఈ అంశం కుదిపేసినంత పనిచేసిన విషయం తెలిసిందే. ఈ నీడలు ఇంకా వీడకముందే పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కావడం వాటిని విడుదల చేస్తూనే ప్రైవేటు స్కూళ్లలో 10 జీపీఏ అమాంతం పెరగడంపై దర్యాప్తు చేయిస్తామంటూ మంత్రి ప్రకటన చేయడం ఇప్పుడు కలవరం రేపుతోంది. మొత్తం పరీక్ష జరిగిన తీరునే అనుమానించాల్సి వస్తోంది.
పేపర్ లీకులయ్యాయనే విషయం నిజం కానుందా అని కూడా భావించాల్సి వస్తోంది. శనివారం సాయంత్రం 3.30గంటకు మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలకు మొత్తం 6,22,538మంది హాజరు కాగా, వారిలో 5,60,253 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 91.92 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా ఇందులో బాలురు 91.87మంది, బాలికలు 91.97 శాతం ఉత్తర్ణత సాధించారు. ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా 97.97 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా, 80.55 శాతంతో చిత్తూరు జిల్లా చివరి స్థానంతో సరిపెట్టుకుంది.
లీక్ కాదు, మాల్ ప్రాక్టీస్: చంద్రబాబు
బినామీ కనుకే ‘నారాయణ’ను రక్షిస్తున్నారా?: వైఎస్ జగన్
‘లీకేజీ’ దోషులను తప్పిద్దాం!