ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల
విశాఖ: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షలకు మొత్తం 6,22,538మంది హాజరు కాగా, వారిలో 5,60,253 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 91.92 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా ఇందులో బాలురు 91.87మంది, బాలికలు 91.97 శాతం ఉత్తర్ణత సాధించారు.
ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా 97.97 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా, 80.55 శాతంతో చిత్తూరు జిల్లా చివరి స్థానంతో సరిపెట్టుకుంది. గతేడాది కన్నా 2.60 ఉత్తీర్ణతశాతం తగ్గినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. 4,102 పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించినట్లు చెప్పారు. రెండు ప్రయివేట్ స్కూళ్లలో జీరో శాతం ఫలితాలు వచ్చాయన్నారు. ఫలితాలను www.sakshi.com, www.sakshieducation.com వెబ్‌సైట్‌లో చూడవచ్చు.