భూముల వివరాలు తెలుసుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారా? రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ అధికారుల తిరస్కారానికి గురవుతున్నారా? నీకు వివరాలు చెప్తే నాకేంటి? అని ఎవరైనా బేరాలాడుతూ గారాలు పోతున్నారా? ఈ సమస్యలను రైతులు, భూ విక్రేతలు, కొనుగోలు దారులు ఇకపై ఎదుర్కోవలసిన అవసరం లేదు.
విజయనగరం కంటోన్మెంట్: రైతుకు భూమి ఎంత ఉంది? దాని సర్వే నంబర్లేమిటి? అన్న వివరాలు ధ్రువీకరించేందుకు అవసరమైన వివరాలు నెట్ ద్వారా రైతులకు అందుబాటులోకి రానున్నాయి. ఇంతవరకు రైతు తన భూమికి సంబంధించిన వివరాల కోసం రెవెన్యూ అధికారులు, మండల స్థాయి అధికారుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వచ్చేది. అయితే ఇక నుంచి ఆన్‌లైన్‌లో రైతు తన భూముల వివరాలు పొందవచ్చు. ఆ వివరాలకు సంబంధించిన కాపీలు కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు భూపరిపాలనా శాఖ కమిషనర్ ఇటీవలే ప్రకటించారు. త్వరలో రైతుల కోసం మీ భూమి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించనున్నారు. ఇందుకోసం అవసరమైన వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేస్తున్నారు.
ఇందులో జిల్లాలోని రైతులందరి భూముల వివరాలు, పట్టా నంబర్లు, సర్వే నంబర్లు, పొజిషన్ వివరాలన్న ్న ంటినీ పొందుపరచనున్నారు. అంతే కాకుండా ఈసేవలను ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా పొందవచ్చు. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను ఈ సేవలను ఆండ్రాయిడ్ ద్వారా పొందేందుకు అవసరమయిన యాప్‌ను అభివృద్ధి చేసే పనిలో సీసీఎల్‌ఏ ఉంది. ప్రస్తుతం జిల్లాలో దాదాపు 5లక్షల ఎకరాల భూమి ఉంది. ఇందులో వ్యవసాయ సాగుకు పనికి వచ్చే భూమి సుమారుగా 3లక్షల ఎకరాలు ఉండగా ైరె తులు దాదాపు మూడున్నర లక్షల మంది ఉన్నారు. అయితే జిల్లాలోని రైతులకు అవసరమైన రికార్డు లకు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అడంగల్ కాపీ కావాలన్నా, పట్టాదారు పాసు పుస్తకాలు కావాలన్నా సంబంధిత రెవెన్యూ అధికారులకు లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రతి వారం గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా రుణ మంజూరు విషయంలోనూ రిజిస్ట్రేషన్ విషయంలోనూ ఈ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీసీఎల్‌ఏ ప్రకటించిన విధంగా ఈ యాప్‌లు, ప్రత్యేక వెబ్‌సైట్లు వస్తే గనక రైతులకు మంచి ప్రయోజనం కలుగుతుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం జిల్లాలో ప్రధానంగా సాగుతున్న వెబ్‌లాండ్ పనులు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. ఎవరైనా రైతులు తమ భూములు అమ్మాల్సి ఉన్నా, ఇతరుల వద్ద నుంచి కొనుగోలు చేయాల్సి ఉన్నా ఆ వివరాలు ఆన్‌లైన్ కాకుంటే వారి నుంచి లంచాలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కాస్త త్వరగా వెళ్లాలి. వెంటనే ఆన్‌లైన్ చేయాలంటే గనక తప్పనిసరిగా వారి నుంచి రెవెన్యూ అధికారులు లంచాలు ఆశిస్తున్నారు. లేకుంటే ఏదో వంక చెప్పి అంత త్వరగా అయ్యే పనికాదనీ, సిబ్బంది లేరనీ, కంప్యూటర్ ఆపరేటర్లు లేరని సాకులు చెబుతున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు, భూ విక్రేతలు, కొనుగోలు దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు సీసీఎల్‌ఏ దీనిపై దృష్టి సారించి మీసేవల్లో పొందుపరిచినట్టుగా అన్ని వివరాలనూ ఒక వెబ్‌సైట్‌లో ఉంచి రైతులకు అందుబాటులోకి తేనుంది. దీని వల్ల జిల్లాలోని రైతులు తమకు అవసరమైన వివరాలను ఆన్‌లైన్ ద్వారా ఒక కాపీ తీసుకునే వెసులుబాటును క ల్పించారు. ఆధార్ నంబర్ ఇచ్చిన వారి వివరాలను ముందుగా పొందుపరుస్తారు. అనంతరం అన్ని రకాల భూములనూ ఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచి అవసరమైన సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేస్తారు. దీనికి సంబంధించిన మెయిల్ అడ్రస్‌ను ప్రకటిస్తారు. ఈ విధానం రానుండడం పట్ల రైతాంగం హర్షం ప్రకటిస్తోంది.
‘మీ భూమి’
Published Mon, Mar 30 2015 3:05 AM | Last Updated on Sat, Aug 18 2018 4:44 PM
Advertisement
Advertisement