వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
విమానాశ్రయం (గన్నవరం) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆది వారం గన్నవరం విమానాశ్రయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గుంటూరు జిల్లాలో జరిగే వివాహ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన బెంగళూరు నుంచి ఎయిర్‌కోస్టా విమానంలో రాత్రి 9.20 గంటలకు గన్నవరం చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన ఆయనకు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.
జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడేందుకు, కరచాలనం చేసేం దుకు యువకులు ఉత్సాహం చూపారు. ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణరెడ్డి, మహమ్మద్ ముస్తాఫా, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, వంగవీటి రాధాకృష్ణ, జోగి రమేష్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రాఘురాం, వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి, గుం టూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, నియోజకవర్గ సమన్వకర్తలు సింహాద్రి రమేష్‌బాబు, దూలం నాగేశ్వరరావు, క్రిస్టీనా, యువజన విభాగం నాయకులు ఉప్పాల రాము, కాజ రాజ్‌కుమార్, అశోక్‌యాదవ్, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మాదు శివరామకృష్ణ, కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకులు యార్కారెడ్డి నాగిరెడ్డి, దేవభక్తుని సుబ్బారావు, కాటంనేని పూర్ణచంద్రరావు, నసీర్ అహ్మద్, ఎ.శ్రీనివాసరెడ్డి, సునితరెడ్డి, నీలం ప్రవీణ్‌కుమార్, జానారెడ్డి, ఎండి.గౌసాని, నీలం స్వరూపరాణి, కంచర్ల చిన్నా, నెరుసు వేదవ్యాస్, లుక్కా ప్రసాద్, నిడమర్తి రామారావు తదితరులు జననేతకు స్వాగతం పలికారు. అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గాన గుంటూరు వెళ్లారు.