ఓటరు జాబితాలో ఈ మారైనా తమ పేరు చూసుకోవాలనుకున్న వారికి మళ్లీ చుక్కెదురే అయ్యింది. ఎన్నో ప్రయాసలకోర్చి దరఖాస్తులు చేస్తే అధికారులు వాటిని తమదైన శైలిలో తిప్పి కొట్టారు.కొత్త వారికి చోటు లేకుండా చేశారు. వారే విధానం అవలంబించి ఓటు హక్కుకు నో అన్నారో అర్థం కాక నమోదుకు ముందుకు వచ్చిన వారు బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నారు.
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఓటు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి.. సొంతూరిలోనే ఓటుహక్కు ఉండాలని అనుకున్న వారికి ఇక నిరాశే మిగలనుంది. ఇంతకుముందు మాదిరిగానే ఈ సారి కూడా అధికారులు వేలాదిమంది ఓటర్లను జాబితా నుంచి తొలగించేశారు. ప్రతీసారి ప్రత్యేకడ్రైవ్ నిర్వహించే అధికారులు.. దరఖాస్తుదారులకు నిరాశనే మిగులుస్తున్నారు.
కొత్త ఓట రు దరఖాస్తుల విచారణ అనంతరం వాటిని పొందుపరిచేందుకు నిర్ణయించిన గడువు మంగళవారం ము గిసింది. వివిధ కారణాలతో ఈ దఫా 77,204 మందిని జాబితా నుంచి తీసేశారు. అయినా మరికొన్నింటిని తొ లగించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇదిలాఉండగా, గతేడాది నవంబర్‌లో జాబి తాను విడుదల చేసే నాటికి 95వేల మంది ఓటర్లను తొలగించిన అధికారులు అందుకు ధీటుగానే ఇప్పుడు చేశారు. దీంతో దరఖాస్తు చేసుకున్న వారికి ఓటుహక్కు కల్పించే కన్నా..తొలగించేవారిపైనే ఎక్కువ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇలా జిల్లా ఓటర్ల సంఖ్య ఓ సారి పెరుగుతూ..మరోసారి తగ్గుతూ వస్తోంది. కొత్తగా ఓటు నమోదుకోసం 1,52,397 దరఖాస్తులు రాగా, వాటిలో 1,25,162 మందికి అవకాశం కల్పించారు. 23,524 మంది దరఖాస్తులను తిరస్కరించి 3711 మందికి సంబంధించిన వాటిని ఎలాంటి విచారణ చేయకుండానే పెండింగ్‌కు పరిమితం చేశారు.
ఇక చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి సంబంధించి 47,136 మంది పేర్లను జాబితాలో నుంచి తీసేశారు. మార్పులు చేర్పుల కోసం 23,617 దరఖాస్తులు రాగా, 15,540 పరిష్కరించి, 6544 తిరస్కరించారు. ఓటర్‌డ్రైవ్‌లో వచ్చిన దరఖాస్తులను విచారణతో పాటు వాటిని ఆప్‌లోడ్ చేసే పనిని అధికారులు పూర్తిచేశారు. ఇక ఈనెల 31న విడుదల చేసే తుది జాబితాకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఈనెల 25న నిర్వహించే జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించే పనిలో బిజీగా నిమగ్నమయ్యారు.
ఎన్నికలకు సమాచారమివ్వని శాఖలు
సాధారణ ఎన్నికలకు సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖలు తమ సిబ్బంది సమాచారాన్ని ఇవ్వాలని కోరినా..94 శాఖలకు 77శాఖలు స్పందించాయి. వాటిలో కేంద్రప్రభుత్వశాఖలైన పోస్టాఫీసు, బ్యాంకులు, బీఎస్‌ఎన్‌ఎల్, ఎల్‌ఐసీ, జెడ్పీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పాలమూరు యూనివర్సిటీ, తూనికలు కొలతలు, ఆడిట్, మునిసిపాలిటీలు, పశుసంవర్థకశాఖ, ఎన్‌సీఎల్‌పీ, ఆర్‌వీఎం, జిల్లా రిజిస్ట్రార్, నెడ్‌క్యాప్, ఎక్సైజ్‌శాఖ, నెహ్రూ యువకేంద్రం ఉన్నాయి.
సారీ... మీకు ఓటు లేదు
Published Wed, Jan 22 2014 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM
Advertisement
Advertisement