
‘డబుల్’ ట్రబుల్!
డబుల్ బెడ్‌రూం ఇళ్లకు దరఖాస్తుల కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు పోటెత్తిన వేలాది మంది ప్రజలు వీరంతా.. గురువారం దరఖాస్తు చేసుకునేందుకు పెద్దసంఖ్యలో జనం రావడంతో లైన్లలో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొందరు గాయపడగా. నలుగురు అక్కడే సొమ్మసిల్లి పడిపోయారు.