విగ్రహాల ఏర్పాటుపై మీ వైఖరి ఏమిటి..? | What is your attitude to the formation of the statues? | Sakshi
Sakshi News home page

విగ్రహాల ఏర్పాటుపై మీ వైఖరి ఏమిటి..?

Published Tue, Dec 23 2014 2:52 AM | Last Updated on Wed, Oct 3 2018 6:55 PM

What is your attitude to the formation of the statues?

 ఇరు ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం
 సాక్షి, హైదరాబాద్: ప్రజోపయోగ స్థలాలు, రోడ్లపై విగ్రహాల ఏర్పాటు విషయంలో వైఖరి ఏమిటో తెలియచేయాలని ఉమ్మడి హైకోర్టు సోమవారం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించిన హైకోర్టు, వారిని ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రకాశం జిల్లాలో ముక్తినూతలపాడు గ్రామం నుంచి గుడిమిల్లపాడు గ్రామానికి వెళ్లే రోడ్డును ఆక్రమించుకుని, ఓ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఎస్.మురళీకృష్ణ 2008లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, దీనిని సోమవారం మరోసారి విచారించింది. వాదనలు విన్న ధర్మాసనం, విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement