సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సలహాదారు విజయ్‌కుమార్ శుక్ర, శనివారాల్లో హైదరాబాద్‌లో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. గ్రేహౌండ్స్, హైదరాబాద్ నగర శాంతిభద్రతలు, పోలీసు బలగాల పెంపు తదితర అంశాలపై డీజీపీ, ఉన్నతాధికారులతో ఆయన చర్చించ నున్నట్లు సమాచారం. హైదరాబాద్ శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించొద్దని ఇరు ప్రాంతాల పార్టీల నేతలు డిమాండ్ చేస్తుండడంతో ఈ సమస్య పరిష్కార చర్యలపై కుమార్ చర్చించనున్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో శాంతిభద్రతలు, పోలీసుల పంపిణీపై కుమార్ గతంలో హైదరాబాద్‌లో మాజీ డీజీపీలతో భేటీ నిర్వహించి కేంద్ర హోం శాఖకు నివేదిక ఇవ్వడం విదితమే. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించడంతో బిల్లులో పొందుపర్చాల్సిన అంశాలపై పూర్తి వివరాల కోసమే తాజా సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
హైదరాబాద్ శాంతిభద్రతలపై ఏం చేద్దాం?
Published Thu, Jan 30 2014 2:14 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement