తెలంగాణ కోసం రాలేదు: విజయ్ కుమార్ | ministry of Home Affairs Task Force, headed by Vijay Kumar arrived in Hyderabad | Sakshi
Sakshi News home page

తెలంగాణ కోసం రాలేదు: విజయ్ కుమార్

Published Fri, Jan 31 2014 9:49 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

తెలంగాణ కోసం రాలేదు: విజయ్ కుమార్ - Sakshi

తెలంగాణ కోసం రాలేదు: విజయ్ కుమార్

హైదరాబాద్ : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సలహాదారు విజయ్‌కుమార్  శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై తాను హైదరాబాద్ రాలేదన్నారు. వివిధ శాఖల్లో భద్రత అంశాల పరిశీలనకు వచ్చినట్లు విజయ్ కుమార్ తెలిపారు. శుక్ర, శనివారాల్లో హైదరాబాద్‌లో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో ఆయన సమావేశం కానున్నారు.

 గ్రేహౌండ్స్, హైదరాబాద్ నగర శాంతిభద్రతలు, పోలీసు బలగాల పెంపు తదితర అంశాలపై డీజీపీ, ఉన్నతాధికారులతో ఆయన చర్చించనున్నట్లు సమాచారం. హైదరాబాద్ శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించొద్దని ఇరు ప్రాంతాల పార్టీల నేతలు డిమాండ్ చేస్తుండడంతో ఈ సమస్య పరిష్కార చర్యలపై కుమార్ చర్చించనున్నారు.
 
  రాష్ట్ర విభజన నేపథ్యంలో శాంతిభద్రతలు, పోలీసుల పంపిణీపై కుమార్ గతంలో హైదరాబాద్‌లో మాజీ డీజీపీలతో భేటీ నిర్వహించి కేంద్ర హోం శాఖకు నివేదిక ఇవ్వడం విదితమే. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించడంతో బిల్లులో పొందుపర్చాల్సిన అంశాలపై పూర్తి వివరాల కోసమే తాజా సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement