కోర్టుకు హాజరైన మంత్రి కేటీఆర్
చిలకలగూడ, న్యూస్‌లైన్: తెలంగాణ ఉద్యమం సందర్భంలో చిలకలగూడ పీఎస్‌లో నమోదైన కేసులో ఐటీ శాఖమంత్రి కె.తారకరామారావు బుధవారం సికింద్రాబాద్ కోర్టుకు హాజరయ్యారు. ఉద్యమంలో భాగంగా రైల్‌రోకో కార్యక్రమం నిర్వహించేందుకు వెళ్తున్న కేటీఆర్‌ను సీతాఫల్‌మండి చౌరస్తాలో పోలీసులు అడ్డుకోగా.. అప్పటి చిలకలగూడ సీఐ బి.అంజయ్య, కేటీఆర్‌ల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది.
కేటీఆర్‌తో పాటు ప్రస్తుత ఎక్సైజ్‌శాఖమంత్రి టి.పద్మారావుపై సీఐ కేసు నమోదు చేశారు. ఈ కేసులో కేటీఆర్ కోర్టుకు హాజరు కాగా, పద్మారావు గైర్హాజరయ్యారు. విచారణ అనంతరం న్యాయమూర్తి కేసును ఆగస్టు 6వ తేదీకి వాయిదా వేశారు. ఇలాఉండగా.. కోర్టుకు వచ్చిన కేటీఆర్‌ను తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కామారెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యేలు గంపా గోవర్ధన్, గువ్వల బాలరాజు, టీఆర్‌ఎస్ నగర యూత్‌వింగ్ అధ్యక్షుడు ఆలకుంట హరి తదితరులు పాల్గొన్నారు.