మక్కువ మండలం ఎస్.పెద్దవలసలో జంట హత్యలు జరిగాయి. భార్యాభర్తలు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు వారిని కొట్టి చంపారని బంధువులు అంటున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. డబ్బు కోసమో, లేదా మరేదైనా కారణం చేతనో ఈ హత్యలు జరిగి ఉండొచ్చని స్థానికులు అంటున్నారు.
పాచిపెంట మండలంలో పాఠశాలలో జరిగిన ఫేర్వెల్ ఫంక్షన్కు హాజరై, తిరిగి రాత్రి పూట ఇంటికి వస్తుండగా గ్రామ శివార్లలోనే వీరిద్దరిపైన ఇనుప రాడ్లతో దాడిచేసి కొట్టి చంపారని అంటున్నారు. అయితే వీరివద్ద ఏమైనా నగలు గానీ, నగదు గానీ పోయాయా అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. పోస్టు మార్టం నివేదిక వచ్చిన తర్వాత గానీ ఇది ఎవరైనా చేసిన హత్యా.. లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే విషయం చెప్పలేమని పోలీసులు అంటున్నారు.
భార్యాభర్తల అనుమానాస్పద మృతి
Published Fri, Mar 14 2014 8:11 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM
Advertisement
Advertisement