ఏలూరు : భర్త, అత్తింటి వారిపై తప్పుడు కేసులు పెట్టించి పిల్లల భవిష్యత్‌ను నాశనం చేయవద్దని భార్యా బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. బాలాజీ మహిళలకు సూచిం చారు. సంఘం రాష్ర్ట్ర స్థాయి సమావేశం ఏలూరులోని వెంకటేశ్వరస్వామి కల్యాణ మంటపంలో ఆదివారం జరిగింది. బాలాజీ మాట్లాడుతూ, వేలాది రూపాయల జీతం భార్య చేతిలో పెడుతున్నా విలాసాలకు అలవాటుపడిన కొందరు భార్యలు భర్తలను వేధిస్తూ, కేసులు బనాయించటంతో జైళ్లకు కూడా వెళ్లవలసి వస్తోందన్నారు.
భర్తలను అవసరాలకు ఉపయోగించుకుంటూ అనంతరం కూరలో కరివేపాకులా తీసివేసే సంస్కృతి పెరిగిపోతోందన్నారు. భర్త సంపాదన సరిపోవటం లేదని సాధించడంతో కొందరు ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారని, దీనికి కారణం ఎవరని ప్రశ్నించారు. భార్యా బాధితులు ఎవరైనా తమ సమస్యలను 88862 36299, 88857 85669, 90100 64589 ఫోన్ నంబర్లలో చెప్పి పరిష్కారం పొందవచ్చని తెలిపారు.
'భర్తల అవినీతికి కారణం భార్యలే'
Published Mon, Jan 27 2014 11:16 AM | Last Updated on Fri, Jul 27 2018 2:21 PM
Advertisement