హైదరాబాద్లో ప్రణాళిక.. విజయవాడలో అమలు
ఎవరో కొంతమందికి లబ్ధి చేకూర్చాలని విజయవాడను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాత్కాలిక రాజధానిగా ఎన్నుకోలేదని రాష్ట్ర మంత్రి రావెల కిశోర్బాబు అన్నారు. విజయవాడను తాత్కాలిక రాజధానిగా ఎంపికచేస్తూ తీసుకున్న నిర్ణయంపై పలు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆయన స్పందించారు.
రాజధాని ఏర్పాటు చేయాలంటే కొన్ని ప్రమాణాలు అవసరమని, ఆ ప్రమాణాలు అమలు చేయాలంటే ఓ తాత్కాలిక రాజధాని అవసరమని, అందుకోసమే తాత్కాలిక రాజధానిగా విజయవాడను ఎన్నుకున్నామని కిశోర్బాబు వివరించారు. హైదరాబాద్‌లో ప్రణాళికలు వేసుకుని విజయవాడలో అమలు చేస్తామని, రాజధాని వికేంద్రీకరించి ఉండాలి కనుకే విజయవాడను ఎన్నుకున్నామని ఆయన అన్నారు.