చీమకుర్తి (ప్రకాశం) : ఇంటి ముందు పని చేసుకుంటున్న మహిళ పాముకాటుకు గురై మృతిచెందింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తిలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి భార్య రమణమ్మ(36) ఇంటి ముందు పని చేస్తున్న సమయంలో పాము కాటు వేసింది. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించేలోపే ఆమె మృతిచెందింది.