న్యాయం చేయాలంటూ బైఠాయింపు | Woman sits on dharna in front of husband's house | Sakshi
Sakshi News home page

న్యాయం చేయాలంటూ బైఠాయింపు

Published Fri, Sep 18 2015 6:42 PM | Last Updated on Sun, Sep 3 2017 9:35 AM

Woman sits on dharna in front of husband's house

యలమంచిలి (పశ్చిమగోదావరి) : భర్త తనను ఇంట్లోకి రానివ్వడం లేదని ఓ భార్య నిరసనకు దిగింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గోంపూరు గ్రామానికి చెందిన తారక రామకృష్ణ ప్రసాద్‌కు విజయలక్ష్మితో 2009లో వివాహమైంది. అయితే వీరిద్దరు మూడేళ్లుగా వేరువేరుగా ఉంటున్నారు. తనను భర్త, మామలు కలసి వేధించడంతోనే వేరుగా ఉంటున్నాని ఆమె తెలిపింది. తనను భర్త ఇప్పటికైనా అర్థం చేసుకుని న్యాయం చేయాలని ఆమె భర్త ఇంటి ఎదుట బైఠాయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement