husbands house
-
భర్త ఇంటి ఎదుట భార్య ధర్నా
కొత్తచెరువు(పుట్టపర్తి) : పెళ్లి చేసుకుని ఆ తరువాత ఇంట్లోకి రానివ్వకుండా వేధిస్తున్న భర్త, అత్తమామాల నుంచి తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ అభాగ్యురాలు ఆందోళనకు దిగింది. ఏకంగా అత్తారింటి ఎదుటే ఆమె ధర్నాకు కూర్చుంది. ముదిగుబ్బ మండలం రామిరెడ్డిపల్లికి చెందిన స్రవంతి వివాహం కొత్తచెరువుకు చెందిన శివారెడ్డి కుమారుడు ఓం ప్రకాష్‌రెడ్డికి 2015లో అయింది. పెళ్లైన కొద్ది రోజులకే స్రవంతిని పుట్టింటికి తరిమేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమెను భర్త కాపురానికి పిల్చుకోలేదు. గతంలోనే ఓం ప్రకాష్‌కు పెళ్లి జరిగిందని, అయితే అ విషయం దాచిపెట్టి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించారు. స్రవంతి ఆందోళనకు ఆమె కుటుంబ సభ్యులు మద్దతుగా నిలిచారు. తనకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆమె భీష్మించారు. కాగా భర్త ఓంప్రకాష్, ఆయన తల్లిదండ్రులు పరారయ్యారు. -
భర్త ఇంటిముందు భార్య న్యాయపోరాటం
నల్గొండ (త్రిపురారం) : త్రిపురారం మండలం బాబా సాయిపేటలో శుక్రవారం ఓ మహిళ తన భర్త ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది. తనను కాపురానికి తీసుకెళ్లాలని భర్త ఇంటి ముందు శుక్రవారం ఆందోళన చేపట్టింది.వివరాల్లోకి వెళ్తే.. బాబాసాయిపేట గ్రామానికి చెందిన గట్టు శ్రీను(27), తిప్పరి మండలం జొన్నలగడ్డ గ్రామానికి చెందిన విమల(22)లు 8 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లపాటు వీరి వివాహం సజావుగానే సాగింది. తర్వాత శ్రీను తన భార్యకు తెలియకుండా మరో స్త్రీని ఇటీవల వివాహం చేసుకున్నాడు. తనను భర్త కాపురానికి తీసుకెళ్లే వరకు ఇక్కడ నుంచి కదలనని భీష్మించుకు కూర్చుంది. శ్రీను మరో ఇద్దరిని కూడా వివాహం చేసుకున్నట్లు స్థానికులు అనుకుంటున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులు ఇరువురిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. -
భర్త ఇంటి ముందు బైఠాయించిన భార్య
కడప అర్బన్ : తనను మోసం చేసి భర్త మరో పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ.. భార్య అత్తింటి ముందు ధర్నాకు దిగింది. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లాలో గురువారం జరిగింది. వివరాల ప్రకారం.. పాలపంపాయ్య వీధికి చెందిన సైదాని బేగం(30)కు 2012 ఫిబ్రవరి నెలలో రవీంద్రనగర్‌కు చెందిన షేక్ జావేద్ బాషా(35)తో వివాహమైంది. వివాహానికి ముందు సైదాని బేగం మస్కట్‌లో లెక్చరర్‌గా పనిచేస్తూ ఉండేది. భర్త కూడా రియాద్‌లోని ఒక ఎలక్ట్రికల్స్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లయ్యాక కొన్నిరోజులు పట్టణంలో ఉన్న తర్వాత భార్యను ఇంట్లో ఉంచి జావేద్ తిరిగి రియాద్ వెళ్లిపోయాడు. అప్పటి నుంచి తిరిగి రాకపోవడంతోపాటు అక్కడే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న సైదాని తనకు న్యాయం చేయాలంటూ గురువారం భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. -
న్యాయం చేయాలంటూ బైఠాయింపు
యలమంచిలి (పశ్చిమగోదావరి) : భర్త తనను ఇంట్లోకి రానివ్వడం లేదని ఓ భార్య నిరసనకు దిగింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గోంపూరు గ్రామానికి చెందిన తారక రామకృష్ణ ప్రసాద్‌కు విజయలక్ష్మితో 2009లో వివాహమైంది. అయితే వీరిద్దరు మూడేళ్లుగా వేరువేరుగా ఉంటున్నారు. తనను భర్త, మామలు కలసి వేధించడంతోనే వేరుగా ఉంటున్నాని ఆమె తెలిపింది. తనను భర్త ఇప్పటికైనా అర్థం చేసుకుని న్యాయం చేయాలని ఆమె భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. -
ఆడపిల్ల పుట్టిందని రెండో పెళ్లి చేసుకున్న భర్త
హైదరాబాద్: ఆడపిల్లల పట్ల సమాజంలో చిన్నచూపు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆడపిల్లలు మంచి చదువులు చదివి, అన్నిరంగాలలో దూసుకుపోతున్నా వారు రెండవ తరగతి పౌరులుగానే మిగిలిపోవడం బాధాకరం. ఆడపిల్ల పుట్టిందని భర్తలు భార్యలను వదిలివేయడం, రెండవ పెళ్లి చేసుకోవడం చేస్తూనే ఉన్నారు. ఇటువంటి సంఘటనే హైదరాబాద్ ఎల్‌బినగర్‌లో జరిగింది. అయితే ఇక్కడ భార్య ఎదురు తిరిగి భర్త ఇంటి ముందు ఆదోళనకు దిగింది. ఎల్‌బినగర్‌లో ఓ భర్త భార్యకు ఆడపిల్ల పుట్టిందని ఆమెను వదిలివేశాడు. మరో యువతిని రెండవ పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే మొదటి భార్య చూస్తూ ఊరుకోలేదు. తనకు పుట్టని కూతురుతో సహా భర్త ఇంటి ఎదుట ఆందోళన చేస్తోంది.