హైదరాబాద్: ఆడపిల్లల పట్ల సమాజంలో చిన్నచూపు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆడపిల్లలు మంచి చదువులు చదివి, అన్నిరంగాలలో దూసుకుపోతున్నా వారు రెండవ తరగతి పౌరులుగానే మిగిలిపోవడం బాధాకరం. ఆడపిల్ల పుట్టిందని భర్తలు భార్యలను వదిలివేయడం, రెండవ పెళ్లి చేసుకోవడం చేస్తూనే ఉన్నారు. ఇటువంటి సంఘటనే హైదరాబాద్ ఎల్బినగర్లో జరిగింది. అయితే ఇక్కడ భార్య ఎదురు తిరిగి భర్త ఇంటి ముందు ఆదోళనకు దిగింది.
ఎల్బినగర్లో ఓ భర్త భార్యకు ఆడపిల్ల పుట్టిందని ఆమెను వదిలివేశాడు. మరో యువతిని రెండవ పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే మొదటి భార్య చూస్తూ ఊరుకోలేదు. తనకు పుట్టని కూతురుతో సహా భర్త ఇంటి ఎదుట ఆందోళన చేస్తోంది.
ఆడపిల్ల పుట్టిందని రెండో పెళ్లి చేసుకున్న భర్త
Published Sun, Nov 24 2013 3:15 PM | Last Updated on Fri, Oct 5 2018 8:54 PM
Advertisement
Advertisement