మొదటి భార్య బంధువుల చేతిలో టెకీ హతం!! | techie killed by first wife's relatives one day before second marriage | Sakshi
Sakshi News home page

మొదటి భార్య బంధువుల చేతిలో టెకీ హతం!!

Published Fri, Dec 12 2014 3:37 PM | Last Updated on Fri, Oct 5 2018 8:54 PM

మొదటి భార్య బంధువుల చేతిలో టెకీ హతం!! - Sakshi

మొదటి భార్య బంధువుల చేతిలో టెకీ హతం!!

విడాకులు తీసుకుని.. రెండో పెళ్లికి సిద్ధమైన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను మొదటి భార్య బంధువులు, మరి కొందరు కలిసి దాడిచేసి అతడిని, అతడి మేనత్తను పొడిచి చంపేశారు. ఈ దారుణం గుంటూరు జిల్లా దాచేపల్లిలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. బాధితుల కథనం ప్రకారం, దాచేపల్లికి చెందిన రావుల కోటేశ్వరరావు (30) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. అతడికి రెండేళ్ల క్రితం పెళ్లయింది, ఏడాది క్రితమే మనస్పర్థలతో భార్యభర్తలు విడాకులు తీసుకున్నారు.

కోటేశ్వరరావుకు పెళ్లి గుంటూరులో శనివారం జరగాల్సి ఉంది. ఈ ఏర్పాట్లలో వాళ్లంతా హడావుడిగా ఉండగా, మొదటి భార్యకు సంబంధించిన కొంతమంది వచ్చి ఈ కుటుంబ సభ్యులపై కత్తులతో దాడి చేశారు. దాంతో కోటేశ్వరరావుతో పాటు అతడి మేనత్త మల్లమ్మ అక్కడికక్కడే మరణించారు. కోటేశ్వరరావు తండ్రి చంద్రయ్య, తల్లి వీరనాగమ్మ, సోదరుడు లింగరాజు తీవ్రంగా గాయపడ్డారు. మరో మేనత్త వెంకటకోటమ్మ కూడా గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement