కడప అర్బన్ : తనను మోసం చేసి భర్త మరో పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ.. భార్య అత్తింటి ముందు ధర్నాకు దిగింది. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లాలో గురువారం జరిగింది. వివరాల ప్రకారం.. పాలపంపాయ్య వీధికి చెందిన సైదాని బేగం(30)కు 2012 ఫిబ్రవరి నెలలో రవీంద్రనగర్‌కు చెందిన షేక్ జావేద్ బాషా(35)తో వివాహమైంది. వివాహానికి ముందు సైదాని బేగం మస్కట్‌లో లెక్చరర్‌గా పనిచేస్తూ ఉండేది. భర్త కూడా రియాద్‌లోని ఒక ఎలక్ట్రికల్స్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
పెళ్లయ్యాక కొన్నిరోజులు పట్టణంలో ఉన్న తర్వాత భార్యను ఇంట్లో ఉంచి జావేద్ తిరిగి రియాద్ వెళ్లిపోయాడు. అప్పటి నుంచి తిరిగి రాకపోవడంతోపాటు అక్కడే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న సైదాని తనకు న్యాయం చేయాలంటూ గురువారం భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది.
భర్త ఇంటి ముందు బైఠాయించిన భార్య
Published Thu, Sep 24 2015 3:04 PM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM
Advertisement
Advertisement