లైంగిక దాడి, ఆపై హత్య
బుడితి(సారవకోట రూరల్): తన కన్న వారింటికి వస్తున్న మహిళ లైంగిక దాడికి గురై, హత్య కాబడిన సంఘటనపై స్థానికంగా పలు అనుమానాలు వ్యక్త మవుతు న్నా యి. పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు... జలుమూరు మండలం అక్కురాడ పంచాయతీ కామినాయుడు పేటకు చెందిన అంపిలి విజయమ్మ(32) సారవకోట మండలం కిన్నెరవాడలో ఉంటున్న కన్నవారింటికి వస్తుండగా బుడితిలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. సంఘటనా స్థలంలో నిరోధ్‌లు ఎక్కువగా ఉండడంతో సామూహిక అత్యాచారానికి గురై ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సంఘటనకు పాల్పడిన వారు సమీప గ్రామాలకు చెందిన వారే అయి ఉంటారని, ఆమెకు పరిచయం ఉన్న వారుగా స్థానికులు అనుమానిస్తున్నారు. గ్రామంలో ఇంతవరకు ఇలాంటి సంఘటనలు జరగకపోవడంతో గ్రామస్తులు, చుట్టు పక్కల గ్రామస్తులు ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు. శనివారం ఉదయం పొలాలకు వెళ్లిన గ్రామస్తులకు మృతదేహం కనబడడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పాలకొండ డీఎస్పీ దేవానంద్ శాంతో, కొత్తూరు సీఐ ఇలియాబాబు, క్లూస్ టీం ఎస్‌ఐ కోటేశ్వరరావు, స్థానిక ఎస్‌ఐ గణేష్ మృ తదేహాన్ని పరిశీలించారు. మృతురాలి కంఠంపై గాయం, నోటి నుంచి రక్తం వచ్చినట్లు గు ర్తించారు. మృత దేహానికి పక్కన మద్యం సీసాలు, నిరోధ్‌లు ఉన్నట్లు కనుగొన్నారు. దీంతో మృతురాలు అత్యాచారానికి గురై హత్య చేయబడిందని నిర్థారణకు వచ్చారు.
మూడేళ్ల కిందటే విడాకులు
కిన్నెరవాడ గ్రామానికి చెందిన అంపిలి విజయమ్మకు 12 ఏళ్ల కిందట జలుమూరు మండలం అక్కురాడ పంచాయతీ కామినాయుడుపేటకు చెందిన రమణతో వివాహం జరిగింది. వీరికి 11 ఏళ్ల కుమార్తె స్వాతి ఉంది. వీరిద్దరూ మూడేళ్ల కిందట చట్టపరంగా విడాకులు పొం దారు. అయితే కుమార్తె స్వాతి తండ్రి రమణ దగ్గరే ఉంటోంది. జలుమూరు కస్తూర్బా గాంధీ పాఠశాలలో చదువుతోంది. మృతురాలు విజయ మ్మ కామినాయుడు గ్రామంలో వేరుగా నివసిస్తోంది. దసరా కోసం తల్లి పిసిని చిన్నమ్మి పిలుపు చేయగా గ్రామానికి బయల్దేరి వెళుతుండగా మార్గ మధ్యలో ఈ సంఘటన జరగడంతో ఆమె తల్లి గుండెలు బాదుకుని విలపిస్తోంది. మృతురాలి తండ్రి సీతారాం, అన్నయ్య త్రినాథ కొన్నేళ్ల కిందటే మృతి చెందారు.
దర్యాప్తు చేస్తున్నాం
మహిళపై అత్యాచారం, హత్యపై స్థానిక వీఆర్వో శ్యామలరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ శాంతో తెలిపారు. విడాకులిచ్చిన భర్త, తల్లి నుంచి ప్రాథమిక సమాచారం స్వీకరిస్తున్నామని, ఈ ఘటనతో ఆమెకు ఎవరితోనైనా అక్రమ సంబంధాలున్నాయా మరే ఇతర కారణాలున్నాయా అన్న అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటామని వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వాస్పత్రికి తర లించారు.