
తలపై వేడి నూనె పోసి.. కత్తితో నరికి!
చీటి డబ్బులు ఇవ్వకుండా వేధిస్తుండటంతో విసిగిపోయిన ఓ మహిళ చీటి నిర్వాహకురాలిని దారుణంగా చంపేసింది. తలపై వేడి నూనె పోసి.. కత్తితో పొడిచి హతమార్చింది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చినబ్రహ్మదేవంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి చీటిల వ్యాపారం నిర్వహిస్తోంది.
సత్యనారాయణమ్మ అనే మహిళ దగ్గర నుంచి 4లక్షల చీటి డబ్బులు తీసుకుని ఏడేళ్ల నుంచి ఇవ్వకుండా వేధిస్తోంది. దీంతో విసిగిపోయిన సత్యనారాయణమ్మ.. వెంకటలక్ష్మి తలపై వేడి నూనె పోసి.. కత్తితో దారుణంగా నరికి చంపింది. పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.