విజయవాడ: నూతన మద్యం పాలసీని నిరసిస్తూ.. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య విజయవాడ నగర శాఖ ఆధ్వర్యంలో నగరంలో ధర్నా నిర్వహించారు. ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్‌లో రోడ్డుపై మద్యం బాటిళ్లను ధ్వంసం చేసి తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం మద్యం పై వ్యవహరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.