వైఎస్ఆర్సీపీ మహిళా ఎంపీటీసీపై టీడీపీ కార్యకర్తల దాడి
Published Fri, Jul 4 2014 8:40 PM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
అనంతపురం: పలు జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడులు కొనసాగుతున్నాయి. తన ఇంటి ముందు బాణాసంచా కాల్చవద్దన్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఎంపీటీసీ రమాదేవిపై టీడీపీ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు.
ఈ ఘటన అనంతపురం జిల్లా గోరంట్లలో చోటు చేసుకుంది. తనపై, తన నివాసంపై రాళ్లదాడి చేసిన టీడీపీ కార్యకర్తలపై ఎంపీటీసీ రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా ఎంపిటీసీ నివాసంపై దాడి చేయడంపై నిరసన వ్యక్తం అవుతోంది.
Advertisement
Advertisement