చంద్రబాబుపై కుప్పం మహిళల ఆగ్రహం!
చంద్రబాబుపై కుప్పం మహిళల ఆగ్రహం!
Published Thu, Jul 17 2014 9:18 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
కుప్పం: అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలను వూఫీ చేస్తావున్న చంద్రబాబునాయుడు ప్రకటన అమలు కాకపోవడంతో కుప్పం నియోజకవర్గంలోని మహిళలు ఆందోళన చెందుతున్నారు. రుణాలిచ్చిన బ్యాంకర్లు వసూళ్ల కోసం గ్రామాల్లో తిరుగుతున్నారు. అసలుకు వడ్డీ వేసి కట్టాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నారు. నిన్న మాఫీ చేస్తామని చెప్పి నేడు కట్టమంటే ఎలా అంటూ డ్వాక్రా మహిళలు సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకర్లు, ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) సిబ్బంది నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక లబోదిబోమంటూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. మా నియోజకవర్గానికి చెందిన చంద్రబాబు సీఎం అయినందుకు సంతోషించామని, రుణమాఫీపై ఎటూ తేల్చకుండా ఇలా ఏడిపిస్తున్నారని శాపనార్థాలు పెడుతున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని నాలుగు వుండలాల్లో ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ద్వారా డ్వాక్రా సంఘాలకు రూ. 133.33 కోట్ల రుణాలు ఇచ్చారు. ఐకేపీలో బ్యాంకు లింకేజ్ ద్వారా రూ. 67.42 కోట్లు, గ్రావు సవూఖ్య ద్వారా రూ. 6.44 కోట్లు, స్త్రీనిధి ద్వారా రూ. 59.42 కోట్లను 3,705 సంఘాలకు పంపిణీ చేశారు. అయితే చంద్రబాబు ప్రకటనతో ఈ రుణాలన్నీ వూఫీ అవుతాయున్న ఆశతోనే నాలుగు నెలలుగా మహిళలు రుణాలు చెల్లించడం లేదు. రుణాల వూఫీపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయుం రాకపోవడంతో రుణాలు వసూలు చేసేందుకు అధికారులు డ్వాక్రా సంఘాలపై ఒత్తిళ్లు తెస్తున్నారు.
డ్వాక్రా వుహిళలు బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలు వూత్రమే రుణవూఫీకి వర్తిస్తాయుని మిగిలిన స్త్రీనిధి, గ్రావు సవూఖ్యల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించాల్సిందేనంటూ ఐకేపీ అధికారులు గ్రామాలలో తిరుగుతూ హెచ్చరిస్తున్నారు. ఓ వైపు అధికారుల ఒత్తిళ్లు, వురోవైపు పెరిగిన అప్పు, వడ్డీలు డ్వాక్రా వుహిళలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం కుప్పం ప్రాంతంలో ఏర్పడిన కరువు కారణంగా రుణాలు చెల్లించడం సాధ్యం కాదంటూ వుహిళలు తేల్చి చెబుతున్నారు.
చెల్లించకుంటే పంచాయుతీ పెడతావున్నారు
డ్వాక్రా సంఘంలో రూ. 50 వేలు రుణం తీసుకున్నాను. అందులో రూ. 10 వేలు కట్టేశాను. రుణవూఫీ అవుతుందని వుూడు నెలలుగా చెల్లించలేదు. ఇప్పుడు అప్పును వడ్డీతో సహా కట్టాలని వూ ఊర్లోని వీవో లీడరు చెబుతోంది. కూలీ చేసుకుని జీవిస్తున్న తవుకు ఒక్కసారిగా అంత డబ్బు కట్టవుంటే కష్టమే. డబ్బు కట్టకుంటే పంచాయుతీ పెడతావుని చెబుతున్నారు. పంచాయుతీ పెడితే అవవూనవుని పెద్దోళ్లకు చెబుతావుని ఇక్కడకు వచ్చాను.
- రాజవ్ము, డ్వాక్రా వుహిళ, గుండ్లవుడుగు, కుప్పం
అధికారులు దయ చూపాలి
తీసుకున్న రుణం రెండు రోజుల్లో చెల్లించాలంటూ ఊర్లోకి అధికారులంతా వస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము. అసలే కరువు కాలంలో ఇప్పటికిప్పుడు చెల్లించమంటే ఎక్కడనుంచి తెచ్చేది. పంచాయుతీ పెట్టి తీసుకున్న రుణాలను వడ్డీతో సహా వసూలు చేస్తావుని చెబుతున్నారు. కూలీ చేస్తే తప్ప పూట గడవని పరిస్థితి. ఒకేసారి అంతమొత్తం చెల్లించలేని పరిస్థితి వూది. అధికారులు వూపై దయు చూపాలి.
- అలివేలు, డ్వాక్రా వుహిళ, గుండ్లవుడుగు, కుప్పం
ఒకేసారి మొత్తం చెలించవుంటే ఎలా?
ఎన్నికలప్పుడు రుణవూఫీ చేస్తావుని హామీ ఇచ్చారు. ఇప్పుడేమో అధికారులు వుూడు నెలలుగా అసలుకు వడ్డీ వేసి ఒకేసారి కట్టవుంటున్నారు. ఇలా అరుుతే వేలాది రూపాయులు ఎలా కట్టాలో అర్థం కావడం లేదు. రుణవూఫీ వువ్ముల్ని చివరకు రోడ్డుపాలు చేసింది. ఇప్పుడు ఏ రుణాన్ని వూఫీ చేస్తారో తెలియుడం లేదు. బ్యాంకు లింకేజా, స్త్రీ నిధా, గ్రావు సవూఖ్యదా అనేది తెలియుడం లేదు. అధికారులనుంచి ఒత్తిళ్లు పెరిగారుు.
-సుజాత, డ్వాక్రా వుహిళ, శాంతిపురం
Advertisement
Advertisement