
తాబేళ్లే... కానీ..!
తలపై ఎర్రటి నామాలతో ఈ తాబేళ్లు వింతగా కనిపిస్తున్నాయి కదూ...! తల్లి తాబేలుకు మెడభాగంలో పులిగోరు, మూడు నామాలు ఉన్నాయి. పిల్ల తాబేలుకు కూడా ఎర్రటి నామాలు ఉన్నాయి. ఇవి గుంటూరు జిల్లా కొల్లూరులో రేపల్లె పశ్చిమ కెనాల్‌లో చేపల వేటకు వెళ్లిన దేవరకొండ నరేష్‌కు దొరికాయి. వింతగా కనిపిస్తున్న వీటిని చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
- కొల్లూరు (గుంటూరు)