tortoises
-
రెక్కలు విప్పి ఎగిరే తాబేళ్లను చూశారా?
మీరు ఎప్పుడైనా తాబేలు ఈగను చూశారా. ఈగ పరిమాణంలో ఉండే తాబేలును చూశారా. అప్పుడు చూడకపోయినా పరవాలేదు, ఇప్పుడు చూడండి.. తాబేలు, ఈగ రెండూ కలిసిన తాబేళ్లు కనువిందు చేస్తున్నాయి. అతి చిన్నగా ఉండే ఈ తాబేళ్లు, ఒక్కసారిగా రెక్కలు విప్పి ఎగురుతున్నాయి. సోషల్ మీడియాలో తాజాగా విడుదలైన ఈ బంగారు రంగు తాబేలు ఈగను అందరూ వింతగా చూస్తున్నారు. కుమ్మరిపురుగు పరిమాణంలో ఈగలా ఎగిరే ఈ బంగారు తాబేళ్లను ముచ్చటగా చూస్తూ, మురిసిపోతున్నారు నెటిజన్లు. సుశాంత్ నందా అనే ఐఎఫ్ఎస్ ఆఫీసరు, ఈ వీడియోను ట్విటర్లో పెట్టారు. ఒక చేతిలో ఉన్న మూడు బంగారు ఈగ తాబేళ్ల తో ఉన్న ఈ వీడియోను అందరికీ చూపాలనుకున్న ఉద్దేశంతో నందా ఇలా చేశారు. ‘‘కొన్నిసార్లు మెరిసేదంతా బంగారమే’’ అంటూ ట్వీట్ చేశారు. మొట్టమొదట ఈ వీడియోను మణిపూర్కి చెందిన థాకమ్ సోనీ అనే ఆర్టిస్టు అందరికీ షేర్ చేశారు. ఈ వీడియోను నందా ట్వీట్ చేయటంతో బాగా వైరల్ అవుతోంది. ఇవి 5–7 మి..మీ. పరిమాణంలో ఉంటాయి. ఒక్కోసారి వీటి ఒంటి మీద మచ్చలుంటాయి. ఇవి దక్షిణ తూర్పు ఆసియాలో సాయంత్రం సమయంలో అందరికీ కనిపిస్తూ కనువిందు చేస్తాయి. ఇప్పుడు ఇవి బంగారంగా కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. ఈ వీడియోను చూసినవారంతా, వారి ప్రాంతాలలో కనిపించే ఇటువంటి తాబేళ్ల గురించి రీట్వీట్ చేస్తున్నారు. చదవండి: పులులు ఈదితే, మొసళ్లు ఒడ్డున సేద తీరుతాయి -
హఠాత్తుగా వేలకొద్ది తాబేళ్లు.. ఎగబడుతున్న స్థానికులు
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాబేళ్లు కలకలం రేపాయి. ములకలపల్లి మండలం పొగళ్లపల్లి, తిమ్మంపేట మార్గం మధ్యలో గుర్తుతెలియని వాళ్లు వేలకొద్ది తాబేళ్లను వదిలివెళ్లారు. దీంతో అక్కడ తాబేళ్లను చూసేందుకు స్థానికులు గుమిగూడారు. కొందరు తాబేళ్లను ఇళ్లకు తీసుకెళ్తున్నారు. పెద్దమొత్తంలో ఎక్కడికో తరలించే క్రమంలో పోలీసులు కంటబడటంతో దొంగలు తాబేళ్లను ఇలా వదిలేసి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. స్థానికులు తాబేళ్ల కోసం ఎగబడుతుండటంతో ఇక్కడ కోలాహలం నెలకొంది. -
శ్రీకాకుళంలో సందడి చేస్తున్న అరుదైన తాబేళ్లు
-
తాబేళ్లే... కానీ..!
తలపై ఎర్రటి నామాలతో ఈ తాబేళ్లు వింతగా కనిపిస్తున్నాయి కదూ...! తల్లి తాబేలుకు మెడభాగంలో పులిగోరు, మూడు నామాలు ఉన్నాయి. పిల్ల తాబేలుకు కూడా ఎర్రటి నామాలు ఉన్నాయి. ఇవి గుంటూరు జిల్లా కొల్లూరులో రేపల్లె పశ్చిమ కెనాల్లో చేపల వేటకు వెళ్లిన దేవరకొండ నరేష్కు దొరికాయి. వింతగా కనిపిస్తున్న వీటిని చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. - కొల్లూరు (గుంటూరు) -
'తాబేళ్ల' కేసులో ముగ్గురి అరెస్టు
హౌరా(పశ్చిమబెంగాల్): తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను హౌరా పోలీసులు ఆదివారం అరెస్టు చేసినట్టు అటవీ అధికారులు తెలిపారు. గులాదోర్ సమీపంలో 6వ నంబరు జాతీయ రహదారిపై డివిజనల్ అటవీ అధికారులు సయ్యద్ హుస్సేన్, అంజన్ గుహలు ఆంధ్రప్రదేశ్ నుంచి 2 వేల తాబేళ్లు ఉన్న వాహనం పట్టుకున్నామని తెలిపారు. వాహనంలో ఉన్న ముగ్గురిని అరెస్టు చేసి రెండు వేల తాబేళ్లను సురక్షిత ప్రాంతానికి తరలించామన్నారు.