హఠాత్తుగా వేలకొద్ది తాబేళ్లు.. ఎగబడుతున్న స్థానికులు | Thousands of Tortoises Spoted in Bhadradri kothagudem | Sakshi
Sakshi News home page

హఠాత్తుగా వేలకొద్ది తాబేళ్లు.. ఎగబడుతున్న స్థానికులు

Published Sun, Nov 24 2019 1:58 PM | Last Updated on Sun, Nov 24 2019 2:51 PM

Thousands of Tortoises Spoted in Bhadradri kothagudem - Sakshi

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాబేళ్లు కలకలం రేపాయి. ములకలపల్లి మండలం పొగళ్లపల్లి, తిమ్మంపేట మార్గం మధ్యలో గుర్తుతెలియని వాళ్లు వేలకొద్ది తాబేళ్లను వదిలివెళ్లారు. దీంతో అక్కడ తాబేళ్లను చూసేందుకు స్థానికులు గుమిగూడారు. కొందరు తాబేళ్లను ఇళ్లకు తీసుకెళ్తున్నారు. పెద్దమొత్తంలో ఎక్కడికో తరలించే క్రమంలో పోలీసులు కంటబడటంతో దొంగలు తాబేళ్లను ఇలా వదిలేసి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. స్థానికులు తాబేళ్ల కోసం ఎగబడుతుండటంతో ఇక్కడ కోలాహలం నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement