- ఐఐటీ ప్రొఫెసర్ మూర్తి
ప్రొద్దుటూరు: లక్ష్యసాధన కోసం విద్యార్థులు శ్రమించాలని ఐఐటీ చెన్నై ప్రొఫెసర్ బీఎస్ మూర్తి తెలిపారు. స్థానిక వైఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాలను మంగళవారం సందర్శించిన ఆయన విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు తాము ఎంచుకున్న రంగంలో నిష్ణాతులుగా ఎదగాలంటే కృషి, పట్టుదల ఉండాలన్నారు. యువత పరిశోధన రంగంవైపు అడుగులు వేయాలని, పరిశోధనపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు దేశంలోని ఎన్నో విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు ద్వారాలు తెరచి ఉంచాయన్నారు. ఈ సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.జయచంద్రారెడ్డి, ప్రొఫెసర్ బీ.జయరామిరెడ్డి, ఎంఎంటీ డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడీ డాక్టర్ ఏ.అశోక్ పాల్గొన్నారు.
నేడు జాతీయ సదస్సు
వైఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాలలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెటలర్జి అండ్ మెటీరియల్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి యూజీసీ ఆధ్వర్యంలో రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ మెటలర్జి అండ్ మెటీరియల్ సైన్స్ రామ్ -2కే15 జాతీయ సదస్సు బుధవారం నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ ఏ.అశోక్‌కుమార్ తెలిపారు.
లక్ష్య సాధన కోసం శ్రమించాలి
Published Wed, Mar 11 2015 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM
Advertisement
Advertisement