ప్రొద్దుటూరు కల్చరల్, న్యూస్‌లైన్: జాతీయగీతం రచించి 103 సంవత్సరాలు అయిన సందర్భంగా శుక్రవారం స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో ‘జయహో జనగణమన’ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణమన గీతం వందేళ్లు నిండిన సందర్భంగా రెండేళ్లుగా విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించేందుకు ఈ మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్ మహబూబ్‌బాష, మల్లిఖార్జునరావు, నడిగడ్డ సుధాకర్, కోనేటి సుధాకరరెడ్డిలు తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా అథ్లెటిక్స్, పాటలపోటీ, చెస్, వక్తృత్వ, చిత్రలేఖన తదితర పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను పంపిణీ చేశారు. జయహోజనగణమనలో 40 పాఠశాలలకు చెందిన 6 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. 6 వేల మంది పైగా విద్యార్థులు, ప్రజలు, ఉపాధ్యాయులు ఒకేసారి జాతీయ గీతాన్ని ఆలపించడంతో ఆ ప్రాంతం అంతా జనగణమన అని మారుమోగింది.
ఉత్సవాలలో భాగంగా విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలు, నృత్యాలు అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ముందుగా ఎమ్మెల్యే లింగారెడ్డి సతీమణి మల్లెల లక్ష్మిప్రసన్న జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో అనిబిసెంట్ పాఠశాల పూర్వవిద్యార్థుల సంఘం అధ్యక్షులు ఆడిటర్ సదాశివ శర్మ, ప్రధానోపాధ్యాయుడు కాశీప్రసాద్, వైవీ న్యాయవాది ముడిమెల కొండారెడ్డి, ఉత్తమ ఉపాధ్యాయుడు ప్రభుకుమార్, మళయాలస్వామి టీపీటీ కళాశాల ప్రిన్సిపల్ గోపీనాయుడు, వ్యాయామ ఉపాధ్యాయుడు రమణయ్య, రాఘవ,గౌతమ్‌హైస్కూల్, గోపీకృష్ణ, కావేరీ, అనిబిసెంట్, ైవె వీఎస్ తదితర పాఠశాలల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
జయహో
Published Sat, Dec 28 2013 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
Advertisement
Advertisement