వరంగల్, న్యూస్‌లైన్ :
అసలే పనిలేని విధులు... దాదాపు నాలుగేళ్లుగా ఖాళీ... మరమ్మతు, నిర్వహణ పనుల్లో అక్రమాలు... ఈ ఘనతను పలువురు ఎస్సారెస్పీ ఇంజినీర్లు ఇప్పటికే సొంతం చేసుకున్నారు. పని లేకుండా ఖాళీగా ఉండడంతో వారిలో పైసల ‘రోగం’ పెచ్చుమీరింది. బోగస్ మెడికల్ బిల్లులు సమర్పించి మెడికల్ రీయిం బర్స్‌మెంట్ కింద 1.20 కోట్లను అప్పనంగా కాజేశారు. ఎట్టకేలకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్‌స మెంట్ అధికారుల విచారణ ఊపందుకోవడంతో అక్రమార్కుల్లో గుబులు నెలకొంది.
హైదరాబాద్‌లో తీగ లాగితే...
హైదరాబాద్‌లోని ఎస్సారెస్పీ క్యాంప్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిపై ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఎస్సారెస్పీ డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ (డీసీఈ)ను విచారణ అధికారిగా నియమించారు. అక్కడ తీగ లాగితే... హన్మకొండ చింతగట్టు ప్రాజెక్టులో డొంక కదిలింది. మెడికల్ బిల్లులకు సంబంధించి అన్ని వివరాలు అందజేయూలని పైసల ‘రోగం’ఎస్సారెస్పీ పరిధిలో ఉన్న వరంగల్ సీఈ కార్యాలయంలోని చింతగట్టు సర్కిల్, నాలుగు డివిజన్ల ఇంజినీర్లకు మెమోలు జారీ అయ్యాయి.
చింతగట్టు క్వాలిటీ కంట్రోల్ సర్కిల్‌లో రికార్డులు దొరకడం లేదనే నెపంతో విచారణలో జాప్యం జరిగింది. దీంతో నీటి పారుదల శాఖ విచారణ బాధ్యతలను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు అప్పగించింది. ఈ మేరకు వారు చింతగట్టు సర్కిల్ పరిధిలోని అన్ని విభాగాల్లో 2008-2013 మధ్య కాలంలో మెడికల్ బిల్లులు వివరాలను కావాలని నోటీసులిచ్చారు. వారికి రెండు డివిజన్లు మినహా మిగతా వాటి వివరాలు అందారుు. దీని ప్రకారం మూడు నె లలుగా జరుగుతున్న విచారణలో హన్మకొండ చింతగట్టు సర్కిల్, ఇతర డివిజన్లలో 36 మంది ఇంజినీర్లు, నలుగురు సిబ్బంది మెడికల్ బిల్లుల్లో అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. రోగం లేకున్నా తప్పుడు బిల్లులతో 1.20 కోట్లు నొక్కేసినట్లు గుర్తించారు. 2010, 2011లో చేపట్టిన నిర్వహణ పనుల్లో అక్రమ బాగోతంపై చార్జ్‌మెమోలు అందుకున్న ఇంజినీర్లు సైతం మెడికల్ బిల్లుల అక్రమాల ఘటనలో మెమోలు అందుకోవడం కొసమెరుపు. ఒకేసారి శాఖాపరంగా... ప్రభుత్వపరంగా విజిలెన్స్ విచారణ కొనసాగుతుండడంతో అక్రమార్కులు హడలిపోతున్నారు.
ఎస్సారెస్పీలో దొంగ మెడికల్ బిల్లులు
Published Fri, Nov 15 2013 4:23 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM
Advertisement
Advertisement